తెలంగాణకు చెందిన నాయకురాలు, బీఆర్ఎస్ పార్టీకి తాజాగా రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత వ్యవహారం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఏపీకి చెందిన వైఎస్ షర్మిల విషయం కూడా తెర మీదకు వచ్చింది. ఇద్దరూ ఫైర్ బ్రాండ్ నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు కావడం, ఇద్దరికీ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావడం వంటివి చర్చనీయాంశంగా మారాయి. ఏపీలో షర్మిల, తెలంగాణలో కవిత ఇద్దరూ ఒకే తరహా బాధితులు అనే వాదన వినిపిస్తోంది.
ఏపీలో జగన్ కోసం పాదయాత్ర చేసి, వైసిపిని నిలబెట్టి, జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ ఇబ్బంది పడకుండా చేశారు అనే విషయం షర్మిల విషయంలో అందరికీ తెలిసిందే. అయితే ఆమెకు పార్టీలో ప్రాధాన్యం లేకుండా… పార్టీలో ఎటువంటి పదవులు ఇవ్వకుండా చేశారన్నది మరో చర్చ. దీంతో షర్మిల తెలంగాణకు వెళ్లిపోయి అక్కడ పార్టీ పెట్టుకోవడం ఆ పార్టీని మళ్లీ కాంగ్రెస్లో విలీనం చేసి తిరిగి మళ్ళీ ఏపీకి వచ్చి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు.
ఇక, బీఆర్ఎస్ విషయానికి వస్తే సొంత పార్టీలోనే ఆమె నాయకురాలుగా ఎదిగారు. ఇప్పుడు పార్టీపై చేసిన తీవ్ర విమర్శలు కావచ్చు.. అంతర్గతంగా ఉన్న విభేదాల నేపథ్యంలో కవిత పార్టీకి దూరమయ్యారు. ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకున్నారు. అయితే షర్మిలకు.. కవితకు మధ్య ఒకే తరహా పోలికలు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. ఎందుకంటే షర్మిల పార్టీ కోసం పనిచేశారు. పాదయాత్ర చేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టారు. కానీ, పార్టీ తరఫున ఆమెకు ఎలాంటి పదవులు దక్కలేదు. కనీసం రాజ్యసభకు పంపించాలన్న విన్నపాన్ని కూడా జగన్ పట్టించుకోలేదు.
ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు ఏపీలో కూడా షర్మిల కనిపించలేదు. పదవులు టికెట్లు మాట ఎలా ఉన్నా కనీసం ఏపీలో కూడా ఆమె ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. కానీ, కవిత విషయానికి వస్తే పార్టీని డెవలప్ చేయటంతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి పేరుతో సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసి దానిని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లారు. ఇది తెలంగాణ ఉద్యమానికి ఎంతో దోహద పడింది. ఆ తర్వాత పార్టీలో ఆమె పదవులు కూడా అనుభవించారు.
నిజామాబాద్ ఎంపీగా విజయం దక్కించుకున్నారు. మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి పోటీ చేశారు కానీ ఓడిపోయారు. దీంతో ఆమెను వెంటనే మండలికి పంపించారు. అంటే ఒక రకంగా పార్టీ కోసం పనిచేసి.. పదవులు తీసుకుని కొంతవరకు సంతృప్తి పడ్డారు అనే చెప్పాలి. షర్మిల విషయానికొస్తే ఈ తరహా పరిస్థితి లేదు. పార్టీ కోసం పని చేశారే తప్ప ఎలాంటి పదవులు అనుభవించలేదు. కాబట్టి ఈ విషయంలో ఇద్దరి మధ్య పోలిక అనేది లేదని చెప్పాలి. అయినప్పటికీ రాజకీయంగా ఇద్దరు బాధితులుగా మిగిలారు.
ప్రస్తుతం షర్మిల పరిస్థితి జాతీయ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండటం కలిసి వచ్చే అంశం. భవిష్యత్తులో ఆమెకు రాజ్యసభ ఇచ్చినా మరొకటి ఇచ్చిన ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న సంతృప్తి అయితే మిగులుతుంది. మరి కవిత విషయం ఏం జరుగుతుంది అనేది చూడాలి.
This post was last modified on September 4, 2025 12:18 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…