“చంద్రబాబు ఓ డిక్షనరీ. ఆయన నుంచి మనం చాలానేర్చుకోవాలి.” – ఈ ఏడాది టీడీపీ ఘనంగా నిర్వహించిన పసుపు పండుగ మహానాడులో ఓ నాయకుడు చేసిన వ్యాఖ్య ఇది. నిజమే.. చంద్రబాబు ఒక డిక్షనరీనే. కానీ, తరచి చూస్తే.. ఆయన ఓ గ్రంధం!!. రాజకీయంగా ఏం చేయాలి.. ఏం చేయకూడదు.. ఎలా ఎదగాలి.. ఎక్కడ తగ్గాలి.. ఎక్కడ నెగ్గాలో పట్టి చూపించే పెద్ద బాలశిక్ష కూడా!. ముఖ్యంగా నేటి తరం నాయకులు నేర్వాల్సిన అనేక అంశాలు చంద్రబాబుకు మాత్రమే సొంతం. మరి వాటిని చూద్దామా..
1) వైరాలకు దూరం: ప్రస్తుతం రాజకీయాల్లోకి వస్తున్న తరం.. ప్రత్యర్థులను శత్రువులుగా చూడడం.. వారితో విభేదించడం.. అల్లర్లు.. దాడులు.. విమర్శలు.. కనిపిస్తున్నాయి. అంతేకాదు.. ఇదే రాజకీయం అనుకుంటున్నవారు కూడా ఉన్నారు. కానీ.. చంద్రబాబు ఏనాడూ.. తన ప్రత్యర్థులను శత్రువులుగా చూడలేదు. ఈ విషయం ఆయన పదే పదే చెప్పారు. తనను ఎంతో విభేదించే వైఎస్‌తోనూ.. ఆయన మిత్రత్వాన్ని కొనసాగించారు. ఇరువురు కలిసి హైటీ వంటి కార్యక్రమాలు కలిసి వచ్చేవారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇది నేటి తరానికి పెద్ద పాఠం.
2) సంపాదన: రాజకీయాల్లోఉన్నవారికి సంపాదన అవసరమే. డబ్బు లేకపోతే.. జెండా కూడా రాదు. ఇక, జెండా మోసేవారు ఎక్కడ వస్తారు. కానీ, ఆ సంపాదన పదిమంది మెచ్చేలా ఉండాలని చంద్రబాబు చెబుతారు. తాను పాటించారుకూడా. తొలినాళ్లలో పెద్దల నుంచి విరాళాలకు ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాత.. కాలంలో సొంతగా వ్యాపారాలు పెట్టుకుని దాని ద్వారా వచ్చిన సొమ్మును రాజకీయాల్లోపెట్టారు. ఈ విషయం గత ఎన్నికల సమయంలో ఆయన సతీమణి భువనేశ్వరి ఇచ్చిన ఇంటర్వ్యూలలో మనకు తెలుస్తుంది. సో.. అడ్డదారుల్లో సంపాదనకు బాబు వ్యతిరేకం అనేది స్పష్టమవుతుంది.
3) ప్రజలతో మమేకం: ఇది చంద్రబాబు నుంచి సొంత నేతలేకాదు.. ప్రత్యర్థులు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఎన్నికలకు ముందు మాత్రమే నాయకులకు ప్రజలు కనిపిస్తారు. కానీ, చంద్రబాబు అలా కాదు.. తాను అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజలు – ప్రజలు.. అంటూ .. పరితపిస్తారు. కరోనా సమయంలో జూమ్ మీటింగ్ ద్వారా అందరినీ ఏకం చేసి.. ప్రజలకు అనేక విషయాలపై వైద్య నిపుణులతో సలహాలు ఇప్పించారు. ఇలానే.. ప్రజలకు తరచుగా చేరువ అవుతుంటారు. నేటితరం కూడా.. ఈ విషయాన్ని గమనించాలి. ఇలా.. అనేక విషయాల్లో చంద్రబాబు నుంచి నేటి తరం నేర్వాల్సింది చాలానే ఉంది..!
This post was last modified on September 3, 2025 8:36 am
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…