ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం.. ఇక, ఎప్పటికీ చెక్కుచెదరని.. టీడీపీ కోటగా మారనుందా? ఇక, ఇక్కడ వేరే పార్టీ కానీ. వేరే జెండా కానీ.. కనిపించే పరిస్థితి ఉండదా? అంటే.. ఔననే అంటున్నారు పార్టీ నాయకులు. సాధారణంగా ప్రజాస్వామ్యంలో ఒక నియోజకవర్గం ఎప్పుడు ఏ ఒక్కరి సొంతం కాదు. ఏ పార్టీ అయినా.. గెలిచే అవకాశం ఉంటుంది. కానీ.. కొన్ని కొన్ని నియోజకవర్గాలుమాత్రం దశాబ్దాలుగా ఒక పార్టీకే.. ఒక నేతకే పట్టం కడుతున్నాయి.
ఇలాంటి వాటిలో కుప్పం ఒకటి. అయితే.. గత ఎన్నికలకు ముందు వైసీపీ ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నించింది. దీంతో చంద్రబాబు ఆయన ప్యామిలీ కూడా అలెర్ట్ అయ్యారు. నియోజకవర్గంలో తమ హవాను తక్కువకాకుండా చూసుకునే ప్రయత్నాలు కూడా చేశారు. అలుపెరుగకుండా.. భువనేశ్వరి పాదయాత్ర కూడా చేశారు. ప్రతిమండలంలోనూ పర్యటించారు. మొత్తానికి వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట వేశారు. ఇక , ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. రాబోయే కొన్ని తరాల పాటు కుప్పంలో టీడీపీ జెండానే ఎగురుతుందని అంటున్నారు స్థానిక నాయకులు.
తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. చంద్రబాబు కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. గత 14 మాసాల్లో చూపిన శ్రద్ధ వేరు.. గత 14 ఏళ్ల సీఎంగా ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకున్నది వేరు. సొంతగా ఇల్లు కట్టుకున్నారు. పార్టీ కార్యాలయానికి తాజాగా 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇక, ఇప్పుడు స్థానికంగా.. కృష్ణా నీటిని తీసుకువచ్చారు. ఇది రికార్డుగా మారింది. గతంలో వైసీపీ ఇది చేసే ఇక్కడి వారి మనసు చూరగొనాలని ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. ఇక, ఇప్పుడు చంద్రబాబు సాకారం చేశారు.
దీనికి తోడు ఏకంగా ఒకేసారి ఆరు కంపెనీలతో పెట్టుబడులు పెట్టించేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఫలితంగా కుప్పంలో ఇంటికో ఉద్యోగం ఖాయమని తెలుస్తోంది. ఇది మరింతగా బాబు గ్రాఫ్‌ను, టీడీపీ హవాను పెంచుతోందని నాయకులు చెబుతున్నారు. మరోవైపు.. ప్రతి ఇంటిపైనా సూర్య ఘర్ పథకం కింద.. విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇక, ప్రతి ఇంటి నుంచి ఒక మహిళలకు ఎన్టీఆర్ ట్రస్టు తరఫున చేతి వృత్తుల్లో ప్రావీణ్యం ఇస్తున్నారు. తద్వారా.. కుప్పం.. ఇక, ఎవర్ గ్రీన్.. ఇక, ఇక్కడ వైసీపీ జెండా పీకేయొచ్చని అంటున్నారు టీడీపీ నేతలు.
This post was last modified on September 2, 2025 9:01 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…