తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు అన్ని అంశాలపైనా సంపూర్ణ అవగాహన ఉందని చెప్పాలి. టీఆర్ఎస్ గా ప్రస్థానం ప్రారంభించిన బీఆర్ఎస్ లో ఆదిలో పార్టీ అదినేత కేసీఆర్ తరఫున అన్నీ తానై చూసుకున్న నేతగా హరీశ్ కు మంచి గుర్తింపు ఉంది. ఈ క్రమంలో పాలనలో దిట్టగా హరీశ్ ఎదిగారు. ఒకానొక దశలో హరీశ్ లేకుంటే టీఆర్ఎస్ ఈ స్థాయిలో ఉండేది కాదన్న మాటా వినిపించింది. అలాంటి హరీశ్ ను చట్టసభలో నిలువరించడం నిన్నటిదాకా ఏ ఒక్కరితోనూ సాధ్యం కాలేదు. అయితే నిన్నటి సభలో హరీశే పొరపాటు వ్యాఖ్యలు చేసి నిండుసభలో తలదించుకున్నారు.
ఇలా నిండుసభలో హరీశ్ రావు తలదించుకోవడం దాదాపుగా ఇదే తొలిసారి అని చెప్పాలి. సభలో ప్రత్యర్థులు సంధించే ప్రశ్నలకు హరీశ్ నుంచి బాణాల్లాంటి సమాధానాలు వస్తాయి. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా కూడా హరీశ్ రావు తీరు మాత్రం ఇదే. అయితే ఆదివారం రాత్రి పొద్దుపోయేదాకా జరిగిన సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై సుధీర్ఘ చర్చ జరిగింది. అధికార పక్షం నుంచి మంత్రులంతా మీదపడిపోతే… బీఆర్ఎస్ నుంచి హరీశ్ ఒక్కరే వారిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ఓ కామెంట్ ను అవహేళన చేస్తూ హరీశ్ ఓ రాంగ్ కామెంట్ చేశారు. దానిని కప్పిపుచ్చుకునేందుకు మరో కామెంట్ చేసి మరింతగా చిక్కుల్లో పడిపోయారు.
కాళేశ్వరాన్ని కాసుల కక్కుర్తి కోసమే కేసీఆర్ కట్టారంటూ పొంగులేటి ఆరోపించగా…దానికి సమాధానంగా హరీశ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన చేసిన సందర్భంగా కేసీఆర్ ను అపరభగీరథుడిగా అభివర్ణిస్తూ ఓ పత్రికా ప్రకటన ఇచ్చారని హరీశ్ ఓ యాడ్ ను చూపారు. దీనిపై వేగంగా స్పందించిన పొంగులేటి… ఆ సమయంలో తాను బీఆర్ఎస్ లోనే లేనని తేల్చిచెప్పారు. కావాలంటే కాస్తంత చెక్ చేసుకుని మరీ మాట్లాడాలంటూ హరీశ్ ను ఎద్దేవా చేశారు. నాడు తాను వైసీపీ తరఫున ఎంపీగా గెలిచి అదే పార్టీలో కొనసాగుతున్నానని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ మాటతో హరీశ్ కు నిజంగానే అనుమానం వచ్చినట్లుగా అనిపించింది.
అయితే అదే సమయంలో పొంగులేటి ట్విట్టర్ ఖాతాలోని ఓ ట్వీట్ ను ఫొటో తీసిన కాపీని హరీశ్ కు ఆయన సహచరులు అందించారు. ఆ తర్వాత ఆ పేపర్ ను పట్టుకుని లేచిన హరీశ్… తాను చెప్పిన యాడ్ తప్పని, అయితే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా కేసీఆర్ ను అపరభగీరథుడిగా పొంగులేటి అభివర్ణించారంటూ ఆ ట్వీట్ ను చదివే యత్నం చేశారు. ఈ సందర్భంగానూ మెరుపు వేగంతో స్పందించిన పొంగులేటి… హరీశ్ రావు అన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ముందుగా సీతారామ అంటారు… ఇప్పుడేమో కాళేశ్వరం అంటారు… కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సం సందర్బంగా తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని పొంగులేటి చెప్పారు. దీంతో హరీశ్ రావు డంగైపోయారు. ఆ తర్వాత లేచిన హరీశ్ ఇక ఆ విషయాన్నే ప్రస్తావించకుండా మిన్నకుండిపోయారు. వెరసి తొలిసారి హరీశ్ చట్టసభలో తలదించేశారని చెప్పక తప్పదు.
This post was last modified on September 2, 2025 8:57 am
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…