రాజకీయాలు అందరూ చేస్తారు. తమకు తాము కీర్తి కిరీటాలు తగిలించుకుంటారు కూడా. అయితే తాను రాజకీయాలు చేయడమే కాకుండా వాటిని పదిమంది మెచ్చేలా చేయడంలోనే కీలకమైన వ్యూహం దాగి ఉంటుంది. ఇలాంటి వాటిలో అందెవేసిన చేయి టీడీపీ అధినేత చంద్రబాబు. ఎక్కడీ వీపీ సింగ్, ఎక్కడీ ప్రధానమంత్రి మోడీ, ఎన్నో ఎన్నికల తరాలు, ఎన్నో రాజకీయాలు. ఆయన చేసిన పనులు, వేసిన అడుగులు రాజకీయాల్లో సుస్థిరత్వాన్ని సొంతం చేశాయి. జగజ్జేతగా నిలబెట్టాయి.
నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితిలో ప్రధానమంత్రిగా చంద్రబాబు అయితేనే మంచిది అని జాతీయ స్థాయి నాయకులు చేసిన వాదన అక్షరాల నిజం. ఆ స్థాయికి ఆయన ఎప్పుడో చేరుకున్నారు. 1998లోనే చంద్రబాబుకు ఈ ఆఫర్ వచ్చింది. ఇక ప్రపంచ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు చంద్రబాబులో సీఈవోను చూస్తే, రాజకీయ నేతలు ఆయనలోని నేతను నిశితంగా గమనించారు. బిల్ క్లింటన్ వంటి అమెరికా అధ్యక్షుడు సైతం చంద్రబాబును కొనియాడారంటే అతిశయోక్తి ఎలా అవుతుంది? ఆయనలో ఉన్న నేతను పట్టి చూపకుండానే!
స్థానిక పార్టీని విశ్వవ్యాప్తం చేయడమే కాదు, ప్రజలను సైతం ప్రపంచం మెచ్చేలా చేసిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతుంది. మెప్మా, డ్వాక్రా వంటి సంఘాల ద్వారా మహిళలు ప్రపంచ దేశాలకు వెళ్లిన ఘటనల వెనుక బాబు వ్యూహం, విజన్ స్పష్టంగా కనిపిస్తాయి. ఇక రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసిన నాయకుడు చంద్రబాబు. అంతేకాదు ప్రత్యర్థి వీక్‌నెస్‌ను ప్రజల మధ్య పెట్టి తనకు అనుకూలంగా మార్చుకునే నేతగా కూడా ఆయన గుర్తింపు పొందారు. విశ్వాన్ని గెలిచిన వాడు జగజ్జేత అయితే, దేశవ్యాప్త రాజకీయ నాయకులు ఏపీ వైపు చూసేలా చేసిన ఘనత ముమ్మాటికీ చంద్రబాబు సొంతం.
ఒకప్పుడు ఏపీ ఎక్కడుందని ప్రపంచంలో వెతుక్కునే పరిస్థితి నుంచి గ్రీన్‌టిక్తో ఏపీ సగర్వంగా ప్రపంచ పటంలో కనిపించేలా చేసిన నాయకుడు కూడా చంద్రబాబు అనడంలో సందేహం లేదు. తరాలు మారినా వారితోనూ కలిసి పనిచేయడం చంద్రబాబు లక్షణం. వారిని తన బాటలో కాదు, తాను కూడా అవసరమైతే వారి బాటలో నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఐటీ మాత్రమే కాదు, అన్నపెట్టే రైతన్న బాగు కోసం కూడా ప్రపంచ స్థాయి డ్రిప్ ఇరిగేషన్ విధానాలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డు సృష్టించారు. అందుకే ఆయన రాజకీయ జగజ్జేత!
This post was last modified on September 1, 2025 2:51 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…