Political News

రేవంత్ వర్సెస్ చంద్రబాబు మరో కీలక చిక్కు..!

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలోనే భేటీ కానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి రాజధాని వరకు ఏర్పాటు చేసే 6 లైన్ల హైవే అంశంపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించి ఒక నిర్ణయానికి రానున్నారు.

ప్రధానంగా ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న రహదారి ఎక్కువ భాగం ఏపీలోనే ఉండనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. వాస్తవానికి హైదరాబాద్‌ నుంచి అమరావతి వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఉండాలనేది సీఎం చంద్రబాబు కూడా భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఫ్యూచర్ సిటీని కలుపుతూ అమరావతి వరకు రహదారి నిర్మించడం ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య అభివృద్ధి, వస్తువుల రవాణా, ప్రజా రవాణాకు ఈ రహదారి ప్రధానంగా ఉపయోగపడుతుందన్న ఆలోచన ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి భూ సమీకరణతో పాటు నిధులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో 60 శాతం కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. మిగిలిన 40 శాతం రెండు రాష్ట్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలోనే భేటీ కావాలని నిర్ణయించారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ భేటీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఎక్కువ భాగం అమరావతికి కనెక్ట్ చేసే ఈ రోడ్డు ఏపీలోనే ఉండనుంది. సూర్యాపేట నుంచి అమరావతి వరకు దాదాపు 150 కిలోమీటర్ల వరకు రహదారిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా భూ సమీకరణతో పాటు నిధులను కూడా వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది.

హైదరాబాద్ వైపు చూస్తే ఫ్యూచర్ సిటీ నుంచి సూర్యాపేట వరకు కేవలం 90 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏమిటంటే, ఫ్యూచర్ సిటీని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో దానికి కనెక్టివిటీ పెంచాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఫలితంగా ఈ భూ సమీకరణకు అయ్యే ఖర్చును తెలంగాణే భరించాలని, నిర్వహణ మొత్తం తాము చూసుకుంటామని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అంటే ఆర్థిక భారాన్ని తగ్గించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

దీనికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. మీ రాష్ట్రంలో ఎక్కువ భాగం రహదారి ఉంటుంది కాబట్టి ఆ ఖర్చు అంతా మీరే భరించాలని తెలంగాణ ప్రభుత్వం సూచనప్రాయంగా తెలిపింది. అయితే కీలకమైన ఫ్యూచర్ సిటీని అనుసంధానిస్తూ అమరావతిని కలుపుతున్నందున, రహదారికి అయ్యే భూ సమీకరణతో పాటు నిధులను కూడా తెలంగాణ ప్రభుత్వం ఇస్తే, ఏపీ ప్రభుత్వం 10% మేర మాత్రమే ఏర్పాటు చేస్తుందన్నది ఏపీ వైపు వాదన. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారే సూచనలు ఉన్నాయి.

ఇప్పటికే బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ వ్యవహరించిన తీరుపై ఏపీ ప్రభుత్వం ఆందోళనగా ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ అంశాన్ని పక్కన పెట్టిన స్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతిని కలుపుతూ ఏర్పాటు చేసే గ్రీన్ ఫీల్డ్ హైవే వ్యవహారం ఏ దిశలో సాగుతుందో చూడాలి.

ఈ రహదారి నిర్మాణాన్ని రెండు రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ, నిధుల సమస్య, భూసేకరణ వివాదం వంటివి రెండు ప్రభుత్వాలకు ఇబ్బందికరంగానే మారే అవకాశం ఉంది. మరి దీన్ని సానుకూలంగా పరిష్కరించుకుంటారా లేక బనకచర్ల ప్రాజెక్ట్ మాదిరిగా పరిష్కారం లేకుండా మిగిలిపోతుందా అన్నది చూడాలి.

This post was last modified on August 29, 2025 9:55 pm

Share

Recent Posts

ఎఫెక్ట్ పడింది… ఐఫోన్ 18 ప్రో ధర పెరిగింది

ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ వస్తుంది. కెమెరా మారుతుంది, చిప్ వేగం పెరుగుతుంది. కానీ ఈసారి ఐఫోన్ 18 ప్రోతో…

22 minutes ago

బేబీ జంటకు ‘ఎపిక్’ ఎగ్జామ్

రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ…

31 minutes ago

అంత గొప్ప పాట‌ను దేవి 8 ఏళ్ల‌కే…

కొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లో అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో ఆడ‌క‌పోయినా.. కొన్ని పాట‌లు, స‌న్నివేశాలు క‌ల్ట్ స్టేట‌స్ తెచ్చుకుంటాయి. వ‌ర్షం…

49 minutes ago

న‌మ్మ‌కం లేన‌ప్పుడు.. బాబు చేసిన‌ట్టు చేయొచ్చుగా జ‌గ‌న్‌!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ త‌ర‌చుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల నిర్వహ‌ణ…

3 hours ago

కసబ్ కు వాళ్లకు తేడా లేదు

స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…

3 hours ago

అది నిజ‌మైతే.. వైసీపీ ఖాళీ అవుతుందా?

వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాట‌లు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్న‌ట్టుగానే పార్టీ అధినేత జ‌గ‌న్…

8 hours ago