విశాఖపట్నానికి సీఎం చంద్రబాబు డబుల్ డెక్కర్ వన్నెలు తెచ్చారు. తాజాగా పర్యాటకుల కోసం.. డబుల్ డెక్కర్ బస్సులను ఆయన ప్రారంభించారు. విశాఖ ప్రస్తుతం పర్యాటక ప్రాంతాల్లో నెంబర్ 1గా ఉందని.. దీనికి మరింత శోభను చేకూర్చేందుకు డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశ పెట్టామని సీఎం తెలిపారు. శుక్రవారం విశాఖలో పర్యటించిన ఆయన.. సాయంత్రం విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రామకృష్ణా బీచ్‌లో వీటిని ఆయన ప్రారంభించారు. అనంతరం.. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి కొద్ది దూరం ప్రయాణించారు.
నిత్యం పర్యాటకులకు మాత్రమే అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన ఈ డబుల్ డెక్కర్ బస్సులు.. ఏపీలోను, ముఖ్యంగా విశాఖలోనూ తీసుకురావడం ఇదే తొలిసారి. జిల్లాలో నిత్యం ఆర్కే బీచ్ నుంచి మరో పర్యాటక ప్రాంతం తొట్లకొండ మధ్య ఈ బస్సులు సేవలు అందిస్తాయి. మొత్తం 16 కిలో మీటర్ల మేర ఈ బస్సులు ప్రయాణించనున్నాయి. ఇవి పూర్తిగా హరిత ఇంధన మైన విద్యుత్‌తోనే నడవనున్నాయి. బస్సులను ప్రారంభించిన అనంతరం చంద్రబాబు వాటిలో కొద్ది దూరం ప్రయాణించి.. విశాఖ తీర అందాలను ఆస్వాదించారు. బస్సులో కూర్చుంటే.. విశాఖ నగరం మొత్తం కనిపించేలా డిజైన్ చేశారని సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖను రాజధానిగా చేస్తామని గత పాలకులు కల్లబొల్లి కబుర్లు చెప్పారని.. బంగారం వంటి అమరావతిని అటకెక్కించారని విమర్శించారు. అయినా.. ఇక్కడి ప్రజలు ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారని చెప్పారు. కూటమికి ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. ఆసియా టెక్నాలజీ హబ్‌గా, రాష్ట్ర ఆర్థిక, ఐటీ క్యాపిటల్‌గా విశాఖ పట్నం మారుతోందని, భవిష్యత్తులో ఈ నగరం ప్రపంచానికే ఆదర్శంగా ఉంటుందని చెప్పారు. త్వరలో డేటా సెంటర్, సీ కేబుల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కేబుల్ ద్వారా విశాఖతో మిగతా ప్రపంచం అనుసంధానం అవుతుందని చంద్రబాబు చెప్పారు. దేశంలోని పలు నగరాలతో విశాఖ పోటీ పడుతూ.. అన్ని రంగాల్లోనూ పుంజుకుంటోందని వివరించారు.
This post was last modified on August 29, 2025 8:49 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…