Political News

భారత్‌ పై ఈ ఏడుపు ఎందుకు ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఎగుమతులపై భారీ సుంకాలు విధించడమే కాకుండా రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌ను తప్పుపట్టడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశమైంది. ట్రంప్ ప్రభుత్వంలోని పీటర్ నవర్రో, స్కాట్ బెస్ెంట్ లాంటి అధికారులు భారత్ రష్యాకు రెవెన్యూ అందించి యుద్ధాన్ని కొనసాగిస్తున్నదని ఆరోపించారు. కానీ వాస్తవ పరిస్థితులు ఈ ఆరోపణలకు విరుద్ధంగా ఉన్నాయి.

భారత్ తన అవసరాలకు మించిన ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం లేదని, మార్కెట్‌లో డిమాండ్ ఉన్నందునే రిఫైన్ చేసి యూరప్, అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తోందని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా రష్యా ఆయిల్‌ కొనుగోలు చేయమని మొదటగా సూచించింది కూడా అమెరికానే అని ఆయన గుర్తు చేశారు. ఐరనికల్‌గా అమెరికా, యూరప్‌లు రష్యాపై సాంక్షన్లు విధించి, తామే ఇబ్బందులు ఎదుర్కొనడం వల్లే భారత రిఫైనరీల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

భారతీయ ఆయిల్‌ కొనుగోళ్లు ఎంత విభిన్నంగా ఉన్నాయో గణాంకాలు చూపుతున్నాయి. ప్రస్తుతం భారత్‌ ఆయిల్‌ అవసరాల్లో సుమారు 20-23% ఇరాక్‌ నుంచి, 16-18% సౌదీ అరేబియా నుంచి, 18-20% రష్యా నుంచి వస్తున్నాయి. అదనంగా 8-10% యూఏఈ నుంచి, 6-7% అమెరికా నుంచి, 5-6% నైజీరియా, ఇతర పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. అంటే రష్యా ఒక్కదానిపై ఆధారపడకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది.

దీనికి విరుద్ధంగా చైనా మాత్రం 2024లో 108 మిలియన్‌ టన్నుల రష్యా ఆయిల్, గ్యాస్ దిగుమతి చేసుకుంది. కానీ ట్రంప్ ప్రభుత్వం చైనాపై ఇలాంటి సుంకాలు విధించడం లేదు. ఎందుకంటే అమెరికా-యూరప్‌లకు చైనాతో వాణిజ్య ఒప్పందాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇక్కడే భారత్‌పై ఒత్తిడి చేయడం ద్వంద్వ వైఖరి అవుతుంది.

మొత్తానికి, అమెరికా తన వ్యాపార లాభాల కోసం యూరప్‌ను తన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ కొనుగోలు చేయమని బలవంతపెట్టడం, బిలియన్ల డాలర్ల డిఫెన్స్ ఒప్పందాలను కుదుర్చుకోవడం సహజంగా కనిపిస్తే, భారత కంపెనీలు రష్యా నుంచి డిస్కౌంట్‌లో ఆయిల్‌ కొనుగోలు చేసి లాభాలు పొందడాన్ని తప్పుపట్టడం ఓకే రకమైన ద్వంద్వ నీతిగా నిలుస్తోంది.

“బిజినెస్ అనేది అమెరికా తత్త్వం అని చెప్పుకునే వాళ్లే, ఇతర దేశాల వ్యాపార నిర్ణయాలను విమర్శించడం హాస్యాస్పదం” అని ఇదివరకే జైశంకర్ ఒక సెటైర్ వేయడం ప్రపంచ మీడియాలో హైలెట్ అయ్యింది. ట్రంప్ ఆరోపణలు వాస్తవానికి నిలవవని, భారత్‌ తన అవసరాలకూ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకూ సరిపడే విధంగానే ఆయిల్ కొనుగోలు చేస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.

This post was last modified on August 25, 2025 8:52 pm

Share

Recent Posts

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

31 minutes ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

46 minutes ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

3 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

4 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

4 hours ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

7 hours ago