రెండేళ్ల కిందట తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలో చేరిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తాను చిన్నప్పటి నుంచే కాంగ్రెస్ అభిమానిని అంటూ ఆ పార్టీ తరఫున గట్టిగానే ప్రచార కార్యక్రమాలు చేపట్టాడు బండ్ల. పేరున్న నాయకుల కంటే బండ్లనే ఎక్కువగా మీడియాలో హైలైట్ అయ్యాడు. జోరుగా ప్రచారం చేశాడు. కానీ అతడి వ్యాఖ్యల్ని, విమర్శల్ని సీరియస్‌గా తీసుకున్న వాళ్లు తక్కువమందే.
ఎందుకంటే పంచ్ డైలాగులు, ఫన్నీ కామెంట్లు సినిమాల్లో వర్కవుట్ అవుతాయి కానీ.. రాజకీయాల్లో పని చేయవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే 7 ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటానంటూ బండ్ల చేసిన కామెంట్ ఎంత కామెడీ అయిపోయిందో తెలిసిందే. ఇంకా పలు రకాల కామెంట్లు ఇలాగే తయారయ్యాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఫలితాలు రావడం, బండ్ల కాంగ్రెస్ పార్టీకే కాదు రాజకీయాలకు టాటా చెప్పేయడం తెలిసిందే.
ఇక అప్పట్నుంచి సినీ రంగంలో హీరోలను కాకా పట్టినట్లే అధికార పార్టీ ముఖ్య నేతల్ని దువ్వే ప్రయత్నం చేస్తున్నాడు బండ్ల. గత ఏడాదిలో కేసీఆర్, కేటీఆర్‌లను ఎన్నిసార్లు పొగిడాడో.. వారికి ఏ రేంజిలో ఎలివేషన్లు ఇచ్చాడో అందరికీ తెలుసు. ఐతే ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా బండ్ల గణేష్ పాత కామెంట్లను బయటికి తీసి అతణ్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. టీఆర్ఎస్ పెద్దల మీద అతడి పంచ్ డైలాగులను వాడుకుంటున్నారు.
ఇది బండ్లకు చాలా ఇబ్బందిగా మారింది. అప్పట్లో చేసిన కామెంట్లను ఇప్పుడు వాడుకోవడం తగదని.. ప్రస్తుతం తనకు ఏ రాజకీయ పార్టీతో కానీ.. రాజకీయాలతో కానీ సంబంధం లేదని.. తాను రాజకీయాలకు దూరం అని.. దయచేసిన తన పాత కామెంట్లు పోస్టులను ఇప్పుడు తీసుకురావద్దని బండ్ల గణేష్ ట్విట్టర్లో విజ్ఞప్తి చేశాడు. రాజకీయ నాయకులు మాట మార్చడం మామూలే. ఐతే తాత్కాలికంగా రాజకీయాల్లో ఉన్న బండ్ల ఇక రాజకీయాల్లోకే రానంటున్నాడు కాబట్టి పాత వ్యవహారాలతో ముడిపెట్టి అతణ్ని ఇరుకున పెట్టడం సరికాదేమో.
This post was last modified on November 22, 2020 4:37 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…