టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన ప్రస్తుతం ఏపీలోనే యాక్టివ్ గా ఉంది. ప్రారంభం నాడు రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ కార్యకలాపాలను సాగించేలా వ్యూహం రచించినా… ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఎప్పటికప్పుడు తెలంగాణలో కూడా పార్టీని విస్తరిద్దామని అనుకుంటున్నా…ఏవో అవాంతరాలు అడ్డుపడుతూనే ఉన్నాయి. అయితే పార్టీని నమ్ముకుని పవన్ వెంట నడిచిన తెలంగాణ జనసేన నేతలు ఇప్పటికీ పార్టీతోనే ఉన్నారు. తాజాగా సేనతో సేనాని పేరిట విశాఖలో జరగనున్న భారీ కార్యక్రమం తర్వాత తెలంగాణలోనూ పార్టీ కార్యకలాపాలు ఊపందుకుంటాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
సాధారణంగా జనసేనకు సంబంధించి భారీ కార్యక్రమాలు ఎక్కడ, ఎప్పుడు జరిగినా… ఏపీ కేడర్ తో పాటు తెలంగాణ కేడర్ కూడా పాలుపంచుకుంటోంది. వీరితో పాటుగా తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రల నుంచి కూడా పవన్ ఫ్యాన్స్ పార్టీ వేడుకలకు హాజరవుతున్నారు. అయితే ఈ దఫా విశాఖలో ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు నాన్ స్టాప్ గా జరగనున్న సేనతో సేనాని సమావేశాలకు పార్టీ తెలంగాణ కార్యవర్గానికి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. దీంతో ఈ సమావేశాలకు తెలంగాణలో పార్టీ విస్తరణ, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు రాజకీయ వాతావరణం తదితరాలపై వివరాలను సేకరించుకుంటూ తెలంగాణ నేతలు ఫుల్ బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే.. సేనతో సేనాని సమావేశం ఆద్యంతం పవన్ కల్యాణ్ కేడర్ కు అందుబాటులోనే ఉండనున్నారు. సమావేశాలు జరిగే మూడు రోజులూ ఆయన ఈ సమావేశాల్లోనే పాలుపంచుకుంటారు. చివరి రోజున జరిగే బహిరంగ సభలో తెలంగాణలో పార్టీ విస్తరణ, భవిష్యత్తు లక్ష్యాలకు సంబంధించి తెలంగాణ నేతలకు పవన్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. అంతకుముందు రెండు రోజుల్లో తెలంగాణ కేడర్ కు కొంత ప్రత్యేక సమయాన్ని కేటాయించి తాజా పరిస్థితుల గురించి వివరాలు తెలుసుకుని మరీ పవన్ పార్టీ విస్తరణకు సంబంధించిన వ్యూహాలను రచించి వారికి ఇవ్వనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా… ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ నానాటికీ బలహీన పడుతోంది. అందులో భాగంగా పార్టీకి చెందిన చాలా మంది కీలక నేతలు ఇప్పటికే పార్టీని వీడగా…మరింత మంది పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ మరింతగా బలహీనపడే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన తెలంగాణలో ఓ మోస్తరు పుంజుకుంటే… బీజేపీనే ఆ పార్టీతో తెలంగాణలోనూ పొత్తు పెట్టుకుని ముందుకు సాగే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో సేనతో సేనాని తర్వాత తెలంగాణలో జనసేన విస్తరణ పక్కానే అని చెప్పొచ్చు.
This post was last modified on August 25, 2025 2:08 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…