రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగితే.. పరిస్థితి ఇలానే ఉంటుంది. అలా కాకుండా.. అధికారంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని పోతే అందరూ మంచోళ్లవుతారు. ఈ విషయం తెలిసి కూడా.. వైసీపీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోరి కోరి తన వ్యవహారాన్ని కొరివితో అంటించుకున్నట్టుగా ప్రవర్తించారు. వైసీపీ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి, ఆయన అనుచరులకు పెద్దారెడ్డి చుక్కలు చూపించారు.
కనీసం నియోజకవర్గంలో కూడా ఉండనివ్వకుండా.. పెద్దారెడ్డి జేసీ వర్గీయులపై దాడులు చేయించారు. తానే స్వయంగా జేసీ ఇంటికి వెళ్లి వీధి రౌడీ మాదిరిగా అద్దాలు పగుల గొట్టి.. నానా భీభత్సం సృష్టించారు. అనంతరం.. జేసీ ట్రావెల్స్ వ్యవహారంపైనా కేసులు పెట్టించారు. ఇలా.. పెద్దారెడ్డి కన్నూ మిన్నూ కానకుండా వ్యవహరించిన తీరు అప్పట్లో వివాదానికి దారితీసింది. ఇక, ఓడలు బళ్లు-బళ్లు ఓడలు అయినట్టుగా వైసీపీ అధికారం కోల్పోయి.. చిత్తుగా ఓడి 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఇప్పుడు అదే పెద్దారెడ్డికి చుక్కలు కనిపిస్తున్నాయి. కనీసం నియోజకవర్గంలోకి అడుగు కూడా పెట్టే పరిస్థితి లేకుండా పోయింది.
తన నియోజకవర్గంలో ఉన్న ఇంటిని కాపాడుకోవాలని.. తన కుటుంబ సభ్యులను కలుసుకోవాలని కోరుతూ.. తాడిపత్రిలోకి వెళ్లేందుకు హైకోర్టు అనుమతులు తీసుకునే పరిస్థితివచ్చింది. దీంతో సింగిల్ జడ్జి ఆయనకు అనుమతి ఇచ్చారు. కానీ, జేసీ వర్సెస్ పెద్దారెడ్డి వర్గీయుల మధ్య ఉన్న విభేదాలతో శాంతి భద్రతలకు ముప్పు వస్తుందని భావించిన పోలీసులు.. హైకోర్టు ఆదేశాలను ద్విసభ్య ధర్మాసనం ముందు సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. సదరు ఉత్తర్వులను రద్దు చేయడంతో పెద్దారెడ్డి.. ఇక, మూడు వారాల వరకు తాడిపత్రిలోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.
కోరి కోరి..
ఇక, తాడిపత్రిలోకి వెళ్లకుండా చేసుకోవడం వెనుక పెద్దారెడ్డి కోరి కోరి తెచ్చుకున్న కష్టాలేనని రాజకీయ వర్గాలు చెబుతున్నా యి. అంతేకాదు.. ఆయన అన్న కుమారుడు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా.. ఈ విషయంలో దాదాపు ఇదే మాట చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విభేదాలు పెంచుకుంటే.. సరికాదన్నారు. కలుపుకొని పోయినా.. పోకపోయి నా.. కనీసం సంయమనం పాటించి ఉంటే.. ఆ పరిస్థితి ఎప్పుడూ.. బాగుండేదన్నది ఆయన అభిప్రాయం. ఇక, పెద్దారెడ్డి విషయంలో వైసీపీ అధిష్టానం కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం. దీంతో ఇక, పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లలేరన్న టాక్ వినిపిస్తోంది.
This post was last modified on August 20, 2025 6:43 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…