Political News

“నా శత్రువు అంటే ఒక స్థాయి, అర్హత ఉండాలి” : సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో తాను గెల‌వడాన్నికొంద‌రు ఇష్ట‌ప‌డ‌లేద‌న్నారు. ఇప్ప‌టికీవారి మ‌న‌స్థ‌త్వం అలానే ఉంద‌న్నారు. ప‌రోక్షంగా ఆయ‌న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. శ‌నివారం సాయంత్రం హైద‌రాబాద్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్రముఖ కవి అందెశ్రీ ప్రచురించిన ‘హసిత భాష్పాలు’ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ పుస్త‌కాన్ని శ్రీరామ్ ర‌చించారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. త‌న గెలుపును కొంద‌రు ఓర్చుకోలేద‌న్నారు. త‌న‌ను ఓడించాల‌ని శ‌త విధాల ప్ర‌య‌త్నించార‌ని చెప్పారు. అయితే.. పాల‌మూరు బిడ్డ‌లు త‌న‌ను గెలిపించార‌ని.. త‌న‌గెలుపును ఎవ‌రూ ఆప‌లేక‌పోయార‌ని అన్నారు. తాను ఎవరిని శత్రువుగా చూడనని, అలా చూడాలంటే వాళ్ళకి ఆ స్థాయి, అర్హత ఉండాలనే వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు.. తాను ముఖ్య‌మంత్రి అవుతాన‌ని కూడా అనుకోలేద‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ వ్య‌వ‌హారం కూడా త‌న ప్ర‌త్య‌ర్థుల‌కు న‌చ్చ‌లేద‌న్నారు. “ఒక ర‌కంగా చెప్పాలంటే.. నా ప్ర‌త్య‌ర్థుల‌కు.. గుండెల‌పై కుంప‌టిలా మారింది. నేను ముఖ్య‌మంత్రిగా సంత‌కం చేస్తే.. వారు త‌మ గుండెల‌పై గీటు పెట్టిన‌ట్టు అనిపించింది.“ అని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ‌పేద‌లు ఆత్మ‌గౌర‌వంతో త‌లెత్తుకునేలా చేస్తున్నామ‌ని సీఎం చెప్పారు. ఇదే అస‌లైన అభివృద్ధి అని పేర్కొన్నారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ తో పేదల ఆత్మగౌరవాన్ని పెంచామ‌ని.. ఇంత‌కంటే తెలంగాణ ప్ర‌జ‌లు కోరుకునే అభివృద్ధి ఏంట‌ని ప్ర‌శ్నించారు. అద్దాల బంగ‌ళాలు, ప్రాజెక్టులు క‌ట్టి వాటి మాటున బొక్కే సంస్కృతికి అభివృద్ధి అని పేరు పెట్టుకున్న వారు ఇప్పుడు ఏమ‌య్యారో అంద‌రికీ తెలిసిందేన‌ని ప‌రోక్షంగా కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన 17 ఏళ్ల త‌ర్వాత‌.. తాను ముఖ్య‌మంత్రి అయ్యాన‌ని.. ఇది తెలంగాణ ప్ర‌జ‌ల ఆశీర్వాదంగా భావిస్తున్న‌ట్టు చెప్పారు. న‌న్ను గెలిపించిన ప్ర‌జ‌లు.. నాపై పెద్ద బాధ్య‌త పెట్టార‌ని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. త‌న ప‌ద‌విని, అధికారాన్ని కూడా ప్ర‌జ‌ల కోస‌మే వినియోగించ‌నున్న‌ట్టు తెలిపారు. “న‌చ్చేవాళ్లు ఉంటారు. న‌చ్చ‌ని వాళ్లు ఉంటారు. కానీ, అధికారాన్ని వారి కోసం ఉప‌యోగించే తెలివిలేని వాడిని కాదు. ప్ర‌జ‌ల కోసం మాత్ర‌మే వినియోగిస్తా“ అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. పేదల కోసమే పని చేస్తాన‌న్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే త‌న ల‌క్ష్య‌మ‌ని సీఎం పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ క‌వులు, ర‌చ‌యిత‌లు.. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం చేసిన పోరాటాన్ని ప్ర‌శంసించారు. 

This post was last modified on August 17, 2025 10:45 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago