Political News

కడప రెడ్డమ్మా…ఈ కుర్చీల గోలేమిటమ్మా?

కడప జిల్లా కేంద్రం స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి సతీమణి రెడ్డప్పగారి మాధవి రెడ్డి వ్యవహారం స్వాతంత్య్ర దినోత్సవాన వివాదాస్పదంగా మారింది. అంతకుముందు కూడా ఇదే తరహా వివాదాలు రేగినా… అవన్నీ మాధవి రెడ్డి స్టామినాను, పోరాట పటిమను చాటాయి. అయితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కడపలో జరిగిన అధికార వేడుకలో వేదికపై తనకు కుర్చీ ఏధంటూ ఆమె ఏకంగా జాయింట్ కలెక్టర్ గా ఉన్న ఓ యువ మహిళా ఐఏఎస్ పై చిందులు తొక్కిన వైనం మాత్రం ఆమెను వివాదంలోకి నెట్టేసిందనే చెప్పక తప్పదు.

సాధారణంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసే వేదికపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ లతో కలిసి జిల్లాకు చెందిన మంత్రి గానీ, ఇంచార్జీ మంత్రి గానీ కూర్చుంటారు. ఒకవేళ జిల్లా మంత్రితో పాటు ఇంచార్జీ మంత్రి… ఇద్దరూ వస్తే కలెక్టర్, ఎస్పీ జాయింట్ కలెక్టర్ లతో కలిసి మొత్తం ఐదుగురు వేదిక మీద కూర్చుంటారు. అయితే జిల్లా కేంద్రానికి చెందిన ఎమ్మెల్యే అయినా, ఆ వేడుకకు హాజరయ్యే జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు అయినా వీవీఐపీల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలలో ముందు వరుసలో ఆసీనులవుతారు. వీరితో పాటు జిల్లా స్థాయి అధికారులు, అధికార పార్టీకి చెందిన జిల్లా స్థాయి నేతలు, స్వాతంత్య్ర సమర యోధులు ఆ గ్యాలరీలలో కూర్చుంటారు.

ప్రొటోకాల్ ప్రకారమే… కడపలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేదికపై జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ జాయింట్ కలెక్టర్ లు ఆసీనులయ్యారు. వేడుకకు భర్తతో కలిసి హాజరైన మాధవి రెడ్డి తనకు వేదికపై మంత్రి పక్కన సీటు వేయకపోవడాన్ని గమనించి… వీవీఐపీ గ్యాలరీ బయట నిలబడ్డారు. ఈ విషయాన్ని గమనించిన జాయింట్ కలెక్టర్ అదితీ సింగ్… ఎమ్మెల్యే వద్దకు వచ్చి వీవీఐపీ గ్యాలరీలో కూర్చోండి అంటూ సూచించారు. అంతే ఒక్కసారిగా భగ్గుమన్న మాధవి రెడ్డి… నాకెందుకు వేదిక మీద కుర్చీ వేయలేదంటూ జేసీపై నిప్పులు చెరిగారు. జేసీ ఏదో తన రాజకీయ ప్రత్యర్థి అయినట్టుగా ఆమె వైపు గుర్రుగా చూస్తూ అపర కాళిక మాదిరే కనిపించారు.

మాధవి రెడ్డి ఆగ్రహానికి బిత్తరపోయిన జేసీ కామ్ గా వెనుదిరిగారు. పరిస్థితి గమనించిన సిబ్బంది అప్పటికప్పుడు వేదిక మీద కలెక్టర్ పక్కన మరో కుర్చీని వేశారు. ఆ తర్వాత వేదిక మీద మంత్రి పక్కన ఆసీనులైన కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్వయంగా లేచి వచ్చి ఆమెను వేదిక మీదకు ఆహ్వానించారు. అయితే అందుకు నిరాకరించిన మాధవి ‘థ్యాంక్యూ సార్’ అంటూ కోపంగా అన్నారు. అయితే గ్యాలరీలో అయినా కూర్చోండి అంటూ ఆయన సూచించగా… అందుకూ ఆమె నిరాకరించారు. ఆ తర్వాత అటు వేదిక ఎక్కకుండా, ఇటు గ్యాలరీలో కూర్చోకుండా తనతో పాటు తన భర్తనూ అరగంట పాటు అక్కడే నిలబెట్టేసుకున్న మాధవి రెడ్డి… ఆ తర్వాత చికాకుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

3 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

5 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

7 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

8 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

8 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

8 hours ago