అసలే ఇప్పుడు బీజేపీ పేరు వినిపిస్తేనే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భగ్గుమంటున్నారు. అలాంటి సమయంలో బీజేపీకి చెందిన ఓ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి మాత్రం రాహుల్ ను మస్తు ఖుషీ చేసిండంటే నమ్మొచ్చా? అంత అనుమానం అక్కర్లేదు. ఆ బీజేపీ ఎంపీ నిజంగానే రాహుల్ ను సంతోషంలో ముంచెత్తారు. మోదీ సర్కారుపై పోరుకు సంబంధించి ఆ బీజేపీ ఎంపీ.. రాహుల్ కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్టేనని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
సరే… అసలు విషయంలోకి వెళితే… బీహార్ కు చెందిన రాజీవ్ ప్రతాప్ రూడీ బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం అంతగా యాక్టివ్ గా లేకున్నా…మోదీ కేబినెట్ లో ఆయన మంత్రిగానూ పనిచేశారు. బీజేపీ అగ్ర నేతల్లో ఒకరిగా ఆయన ఎదుగుతారన్న వాదనలు వినిపించినా… ఎందుకనో గానీ సడెన్ గా రూడీ ఇనాక్టివ్ అయిపోయారు. ఇక పార్లమెంటులోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ చైర్మన్ ఎన్నికలు జరగగా… వాటిలో చాలా కాలంగా యాక్టివ్ గా పాలుపంచుకుంటున్న రూడీ… మొన్నటిదాకా అదే పదవిలో కొనసాగారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. అయితే రూడీ పోటీ చేసింది ఎవరి మీదో తెలుసా? ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మద్దతులో బరిలోకి దిగిన బీజేపీ ఎంపీ సంజీవ్ బల్యాన్ పై రూడీ విజయం సాధించారు.
అంటే… ఈ ఎన్నికల్లో మోదీ, షాల అభ్యర్థిని రూడీ ఓడించినట్టే కదా. ఇదే విషయం తెలిసిన రాహుల్ గాంధీ గురువారం పార్లమెంటు ఆవరణలో లోపలికి వెళుతున్న క్రమంలో రూడీ తన సహచరులతో ముచ్చటిస్తూ కనిపించారు. రూడీని చూడగానే భలే ముచ్చట పడ్డ రాహుల్ తన చేయి చాచి మరీ రూడీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. రాహుల్ స్వయంగా చేయి అందించడంతో రూడీ కూడా ఆయనతో కరచాలనం చేశారు. మోదీ, షా ద్వయాన్ని ఓడించాడన్న భావనతో రూడీని ఓ యోధుడిలా చూసిన రాహుల్… ఆ తర్వాత రూడా కాస్త దూరం వెళ్లి తిరిగి ఆగి… రూడీతో మాట్లాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
This post was last modified on August 13, 2025 9:48 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…