ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారే ముఖ్యం. లేకపోతే ప్రభుత్వం అయినా, నాయకులు అయినా కళ్లెంలేని గుర్రాలే అవుతారు. అందుకే ప్రజాస్వామ్య దేశాల్లో భావప్రకటన స్వేచ్ఛకు పెద్దపీట వేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ప్రశ్నించే విషయంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాలు మారాయి, పాలన కూడా మారింది. అయితే, విపక్ష పాత్ర పోషించే విషయంలో రెండు రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయాలు సాగుతున్నాయి.
తెలంగాణను తీసుకుంటే — అధికారం కోసం పోటీలో మూడు పార్టీలు పరిగులు పెడుతున్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ప్రతిపక్షాలుగా ఉండగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం మూడు పార్టీలూ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో ఏ పార్టీకి తేడా లేదు. అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల కోసం రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్, బీజేపీలు కూడా ప్రభుత్వాన్ని సాధ్యమైనంతవరకు ఇరుకున పెడుతున్నాయి.
దీంతో తెలంగాణ రాజకీయాల్లో పార్టీల మధ్య పోరు జోరుగా సాగుతోంది.
ఏపీ విషయానికి వస్తే — ఇక్కడ ప్రధానంగా టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య పోరు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ, ఇందులో మూడు పార్టీలు ఉన్నా, ప్రధానంగా టీడీపీ మాత్రమే హైలైట్ అవుతోంది. వచ్చే ఎన్నికల కోసం టీడీపీ ఇప్పటి నుంచే బాటలు వేసుకుంటోంది, సంక్షేమాన్ని–అభివృద్ధిని బలంగా తీసుకువెళ్తోంది. అయితే, ప్రజల తరఫున రాజకీయంగా పోరాటం చేయాల్సిన వైసీపీ మాత్రం వీక్‌గా మారిపోయిందనే వాదన వినిపిస్తోంది.
బలమైన గళం వినిపించడంలో వైసీపీ అధినేత జగన్, గతంతో పోలిస్తే చాలా వీక్ అయిపోయారని తాజాగా వెలువరించిన ఓ సర్వే స్పష్టం చేసింది. 2014–19 మధ్య ఉన్న దూకుడు, బలమైన వాయిస్ ఇప్పుడు లేకుండా పోయిందని ఈ సర్వే చెబుతోంది.
రాజకీయాల్లో పోటీ ఉంటే, ప్రతిపక్షంలో కూడా పోటీ ఉంటుంది — ఇది తెలంగాణలో మాత్రమే కనిపిస్తోంది. ఏపీ విషయానికి వస్తే, పార్టీల మధ్య కూడా పోటీ లేదు. కాంగ్రెస్ ఉన్నా, లేనట్టే అని రాజకీయ వర్గాలే కాదు, ప్రజలు కూడా భావిస్తున్నారు.
కమ్యూనిస్టుల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. దీనికితోడు, జనసేన, బీజేపీలు రెండూ కూడా అధికార పక్షంలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ప్రజల తరఫున పోరాడాలన్నా, పార్టీ పరంగా దూకుడుగా ఉండాలన్నా ఒక్క వైసీపీకి మాత్రమే ఛాన్స్ ఉంది. కానీ, దీనిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇదే వైసీపీని వీక్‌గా మారుస్తోందని తాజాగా స్వతంత్ర సంస్థ చేసిన సర్వేలో తేలింది.
కేవలం ఇంటికే పరిమితం కావడం, పార్టీ నాయకుల సమస్యలను మాత్రమే హైలైట్ చేయడం వల్ల వైసీపీ వీక్ అవుతోందని ఈ సర్వే చెబుతోంది.
This post was last modified on August 10, 2025 5:38 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…