తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును రాష్ట్రపతి ఇప్పటి వరకు ఆమోదించలేదు. మరోవైపు.. గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసినా.. దాని ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి.. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోం ది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు.. ఢిల్లీలో ధర్నాకు దిగారు. పార్లమెంటులో అయినా .. రిజర్వేషన్‌ను ఆమోదించేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే.. ఈ ధర్నాపై కేంద్ర మంత్రి, తెలంగాణకు చెందిన బీజేపీ నాయకుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముస్లింల కోసం.. ముఖ్యంగా ఎంఐఎం కోసం.. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే ఢిల్లీలో యాగీ చేస్తున్నారని బండి విమర్శించారు. వాస్తవానికి.. కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ వేరని.. కానీ.. దానికి భిన్నంగా ఇప్పుడు.. ముస్లింల కోసం కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారని విమర్శించారు. బీసీలకు 5 శాతం పెంచి.. ముస్లింలకు అదనంగా పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్ర చేస్తున్నారని బండి నిప్పులు చెరిగారు.
బీసీల పేరుతో మైనారిటీ ముస్లింలకు రిజర్వేషన్ కట్టబెట్టేందుకు.. ముఖ్యంగా ఎంఐఎంకు మేలు చేసేం దుకు.. కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. బీసీలకు పూర్తిగా 42 శాతం రిజర్వేషన్ అమ లు చేస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదన్న బండి.. కానీ, క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదన్నారు. మైనారిటీ ముస్లింలకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వాస్తవానికి బీజేపీ బీసీ పక్షపాతి అని పేర్కొన్నారు. అందుకే.. మూడు సార్లుగా బీసీకే ప్రధాని పీఠం అప్పగించామన్నారు.
కానీ.. కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా బీసీలకు మేలు చేసిందా? అని ప్రశ్నించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎ న్నడైనా బీసీని ప్రధాని చేశారా? అని బండి నిలదీశారు. ఉమ్మడి ఏపీలో కూడా బీసీకి ముఖ్యమంత్రి పదవి దక్కలేదన్నారు. తెలంగాణ కేబినెట్, నామినేటెడ్ పదవుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారో.. రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. బీసీలకు న్యాయం చేయాలంటే అది ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు.
This post was last modified on August 6, 2025 6:57 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…