ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గురువారంతో ఆయన పర్యటన ముగియనుంది. తొలి రోజు నుంచి ఆయన పెట్టుబడులు.. పీ-4పై ప్రధానంగా దృష్టి పెట్టారు. సింగపూర్‌లో రోడ్ షో కూడా నిర్వహించి.. పారిశ్రామిక వేత్తలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. పెట్టుబడులు.. విద్యా సంస్థలకు సంబంధించిన ప్రతినిధులతో పాటు.. పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ అధికారులు, మంత్రుల ను వరుసగా చంద్రబాబు కలుస్తూనే ఉన్నారు. ఏపీలో ఉన్న అవకాశాలు.. ఇతరత్రా అంశాలను కూడా ఆయ న వారికి వివరించారు.
తాజాగా బుధవారం కూడా పెట్టుబడుల వేటలో చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. కేవలం రెండు మూడు గంటల్లోనే కీలక వ్యాపార దిగ్గజాలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో భారత్‌కు చెందిన, సింగపూర్‌లో స్థిరపడిన కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థకు చెందిన ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. అదేవిధంగా మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమ్‌సెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతోనూ చంద్రబాబు చర్చించారు. ఏపీలో ఉన్న అవకాశాలను వారికి వివరించారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు.
పెట్టుబడులు పెట్టి.. కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. దీనికి కేపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరిశంకర్ నాగభూషణం ఓకే చెప్పారు. అంతేకాదు.. సీఎం చంద్రబాబు విజన్-2047ను వారు కొనియాడారు. తప్పకుండా ఏపీలో పెట్టుబడులు పెడతామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామన్నారు. చంద్రబాబు కూడా వారిని అభినందించారు. ఒక్క ప్రజెంటేషన్‌తోనే వారు ఏపీ పై సానుకూలత చూపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఏయే రంగాల్లో పెట్టుబడులు?
+ ఐటీ పార్కులు.
+ వర్క్ స్టేషన్ల ఏర్పాటు.
+ వైల్డ్ లైఫ్ పార్కులు.
+ ఎకో టూరిజం.
+ బయో డైవర్సిటీ కాంప్లెక్స్‌లు.
+ వైల్డ్ లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ జోన్ల ఏర్పాటు.
+ మౌలిక వసతుల కల్పన.
+ గ్రీన్ ఎనర్జీ.
+ ఫైనాన్స్, ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ లెండింగ్.
+ క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్.
This post was last modified on July 30, 2025 7:30 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…