రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఏమాత్రం బాధ్యత లేకుండా హ్యాపీగా తిరిగేస్తున్ననేత ఎవరైనా ఉన్నారా ? అంటే అది జనసేన అధినేత పవన్ కల్యాన్ మాత్రమే అని ఎవరైనా సమాధానం చెప్పేస్తారు. ప్రశ్నించేందుకు రాజకీయ పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ తాను ఎవరిని ప్రశ్నించాడు? ఎవరిని ప్రశ్నిస్తున్నాడనే విషయాల్లో మాత్రం క్లారిటి లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇంత గందరగోళంగా రాజకీయ పార్టీని నడుపుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే దేశం మొత్తం మీద బహుశా పవన్ ఒక్కరే కనిపిస్తారేమో. ఇటువంటి పవన్ ఈనెల 17, 18 తేదీల్లో రాజధాని జేఏసీ ప్రతినిధులు, రైతులతో సమావేశం పెట్టుకున్నారు మంగళగిరి కార్యాలయంలో.
చంద్రబాబునాయుడుకు కొంతకాలం మిత్రపక్షంగా వ్యవహరించారు. తర్వాత పూర్తిగా విభేదిస్తు నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. మళ్లీ బీజేపీతో కలిసిపోయారు. ఒక్క విషయంలో మాత్రం పవన్ కు మంచి క్లారిటి ఉందని అర్ధమైపోతోంది. అదేమిటంటే తాను ఎవరితో కలిసున్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డిని మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తుంటారని. చంద్రబాబుతో కలిసున్నా, విడిపోయినా జగన్ కు మాత్రం వ్యతిరేకంగానే ఉన్నారు.
పార్టీ భవిష్యత్తు ఏమిటో మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. రెండుచోట్ల పోటీ చేసిన పవనే ఓడిపోవటంతో మొత్తం పార్టీ నేతలే అడ్రస్ లేకుండా పోయారు. అసలు పవన్ లో సమస్య ఏమిటంటే ఏ విషయంలో కూడా స్పష్టమైన విధానమంటు లేకపోవటమే. రాజధాని రైతులకు ఒసారి మద్దతుగా మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో పర్యటించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా రైతులను రెచ్చగొట్టారు. తెరవెనుక ఏమి జరిగిందో ఏమో తర్వాత రైతులను గాలికొదిలేసి చంద్రబాబుతో చేతులు కలిపేశారు.
మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపాదించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు రాష్ట్రం మొత్తానికి అమరావతే రాజధాని అయినా తనకు మాత్రం కర్నూలే రాజధాని అన్నారు. మరి జగన్ కర్నూలును న్యాయ రాజధానిగా ప్రతిపాదిస్తే వ్యతిరేకిస్తున్నారు. మరోసారి రాజధానిగా అమరావతి పనికిరాదు విశాకపట్నమే బెస్టంటు నానా యాగీ చేశారు. అలాంటిది ఇపుడు జగన్ అధికారంలోకి రాగానే వైజాగ్ ను రాజధానిగా చేస్తానంటూ వద్దంటు వ్యతిరేకిస్తున్నారు. పవన్ లోనే ఇంత గందరగోళం కనిపిస్తుంటే ఇక నేతలు మాత్రం ఏమి చేస్తారు ?
ఇటువంటి నేపధ్యంలో తాజాగా పవన్ రాజధాని రైతులతోను, అమరావతి జేఏసీ నేతలతోను ఎందుకు సమావేశం అవుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. పవన్ వ్యవహారం చూస్తుంటే ఏదో టైంపాస్ రాజకీయాలు చేస్తున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజకీయాల్లో గ్యాప్ వస్తే సినిమాలు చేసుకోవటం. సినిమాల్లో గ్యాప్ వస్తే రాజకీయాలు మాట్లాడటం అనే రెండు పడవలపై కాళ్ళు పెట్టారు. మరి ఏకకాలంలో ఇటు పార్టీ నేతలను, అటు జనాలను ఎంతకాలం మోసం చేద్దామని అనుకుంటున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఏం చేస్తాం ఎవరికైనా జరిగినంత కాలమే అని సరిపెట్టుకోవాల్సిందే.
This post was last modified on November 18, 2020 10:52 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…