కాపు సామాజిక వర్గం ఖుషీ అయ్యే వార్త ఇది!. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని వీరి కోరిక. అందుకే తరచుగా ఆయన పర్యటనల్లోనూ.. ఆయన ఎక్కడైనా పాల్గున్నప్పుడు కూడా.. సీఎం-సీఎం అంటూ.. పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్నారు. అయితే.. ఇప్పటికిప్పుడు ఆ పదవి తనకు భారమని పవన్ చెబుతున్నారు. మరో 15 ఏళ్ల వరకు కూటమిగానే ఉంటానని అంటున్నారు. దీంతో కాపులు ఒకింత హర్ట్ అవుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు ఈ నెలలో నాలుగు రోజుల పాటు.. విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 21 నుంచి ఆయన సింగపూర్‌కు వెళ్తారు. అక్కడ అమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించి చర్చించనున్నారు. పనిలో పనిగా సింగపూర్‌కు చెందిన సంస్థ లతోనూ పెట్టుబడులపై చర్చిస్తారు. ఈ పర్యటనను సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజధానికి నిధులు వచ్చిన నేపథ్యంలో పనులు వేగంగా చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో అవసరమైతే.. మరో రెండు రోజులైనా సింగపూర్‌లోనే ఉండి పనులు చక్కబెట్టుకుని రావాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పాలనను ఎవరు చూస్తారు? అనేది కీలకం. గతంలో అయితే.. చంద్రబాబే ఎక్కడ ఉన్నా.. పాలనను మేనేజ్ చేసేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈ నేపథ్యంలో ‘ఇంచార్జ్ ముఖ్యమంత్రి’గా పవన్ కల్యాణ్ బాధ్యతలు చూస్తారంటూ.. అన్ని శాఖలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయాన్ని అధికారులు కూడా ధ్రువీకరించారు. ఈ రోజో రేపో.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయని.. అధికారికంగానే సీఎం చంద్రబాబు పవన్‌కు ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగిస్తున్నారని.. చెబుతున్నారు. దీంతో కాపులు హ్యాపీగా ఫీలయ్యే అవకాశం ఏర్పడిందన్నమాట.
This post was last modified on July 15, 2025 11:52 am
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…