ఆయన ఓ ఎంపీ. అంతే కాదు కేంద్రంలో మంత్రి కూడా. తొలిసారి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో అనూహ్యమైన విజయాన్ని దక్కించుకున్నారు. టిడిపికి కంచుకోటగా భావించే గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి విజయం దక్కించుకున్నారు. ఆయనే పెమ్మసాని చంద్రశేఖర్. వృత్తిరీత్యా వైద్యుడు. అమెరికాలో వైద్యశాలలతో పాటు అక్కడ వైద్య వ్యాపారంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. చంద్రబాబు పిలుపుతో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడమే కాకుండా అనూహ్యమైన విజయాన్ని దక్కించుకున్నారు.
కేంద్రంలో మంత్రి పదవిని కూడా ఆయన దక్కించుకున్నారు. ఏడాది కాలంలో కేంద్ర మంత్రిగా ఆయన ఎలా ఉన్నా నియోజకవర్గ స్థాయిలో మాత్రం ఖచ్చితంగా మంచి మార్కులు పడుతున్నాయని చెప్పాలి. వారంలో నాలుగు రోజులకు ఒకసారి నియోజకవర్గానికి రావడం.. స్థానికంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం, మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కూడా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తుండడం వంటివి ఎంపీ రాజకీయాల్లో కీలకమనే చెప్పాలి.
ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఎలాంటి అవరోధాలు రాకుండా, లేకుండా పెమ్మసాని ముందుకు సాగుతున్నారు. నిజానికి ఆయనకు రాజకీయాలు కొత్త కావడంతో స్థానికంగా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకోవడం కొంత సమయం పడుతుంది అని అందరూ భావించారు. కానీ పెమ్మసాని మాత్రం పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా రాజకీయాల్లోకి వచ్చి రాగానే గుంటూరు నియోజకవర్గ పరిస్థితిపై అవగాహన చేసుకున్నారు. ఏ నేత పరిస్థితి ఏంటి? ఏ మండలంలో పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది ఏ మండల స్థాయిలో పార్టీ డెవలప్ కావాలి అనేదానిపై సుదీర్ఘ కసరత్తు చేశారు.
దీనిని అనుసరిస్తూ ఇప్పుడు ప్రతి వారం ఆయన ఆయా మండలాల్లో పర్యటిస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతున్నారు. ఫస్ట్ టైం ఎంపీ అన్న ముద్రను దాదాపు చెరుపేసుకుంటూ ఆయన అనుభవం ఉన్న నాయకుడిగా ముందుకు సాగుతున్నారు. నిజానికి అనుభవం లేకపోయినా ప్రజలతోనూ ఇటు నాయకులు అల్లుకుపోతున్న తీరు నభూతో న భవిష్యత్తు అన్నట్టుగానే సాగుతోందని చెప్పాలి.
This post was last modified on July 9, 2025 11:32 am
ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్టీ పుంజుకుంటున్న పరిస్థితి…
రాజమౌళితో సినిమా చేయాలని ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి పేరున్న హీరో ఆశపడుతుంటాడు అనడంలో సందేహం లేదు. ఐతే రాజమౌళి…
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…
పెద్ద బడ్జెట్ పెట్టి, చాలా కాలం కష్టపడి, ఎన్నో ఆశలతో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తట్టుకోవడం తేలిక…