Political News

అరుణమ్మకు ప్ర‌మోష‌న్‌.. బీజేపీ స్ట్రాట‌జీ

తెలంగాణ బీజేపీలో ప‌ద‌వుల పందేరం కొన‌సాగుతోంది. తాజాగా రామ‌చంద‌ర్‌రావుకు రాష్ట్ర బీజేపీ ప‌గ్గాలు అప్ప‌గించిన అధిష్టానం.. ఈ పోస్టును ఆశించిన ఒక‌రిద్ద‌రు నాయ‌కుల‌ను సంతృప్తి ప‌రిచేందుకు మ‌రో రూపంలో వారికి ప్ర‌మోష‌న్ ఇస్తోంది. ఈ జాబితాలో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పార్ల‌మెంటు ఎంపీ, ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, మాజీ మంత్రి డీకే అరుణ‌కు కీల‌క ప‌దవిని ఇచ్చింది. అంతేకాదు.. ఇప్ప‌టికే ఆమెకు రెండు ప‌ద‌వులు ఉన్నా.. ఇప్పుడు మూడో ప‌ద‌విని కట్ట‌బెట్ట‌డం ద్వారా ఫైర్ బ్రాండ్ల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్టు అయింది. త‌ద్వారా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా రాజ‌కీయాల్లో బీజేపీని పుంజుకునేలా చేస్తోంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న డీకే అరుణ‌కు.. ఫుడ్ కార్పొరేషన్ తెలంగాణ ఛైర్మన్ కూడా గ‌తంలో ఇచ్చారు. అదేవిధంగా బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షురాలిగా కూడా అరుణ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. ఆమె రాష్ట్ర పార్టీ ప‌గ్గాల‌ను ఆశించార‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. దీని కోస‌మే గ‌త నెల‌లో వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి.. మ‌రీ ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, ఆమె ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఈ క్ర‌మంలోనే తాజాగా బీజేపీ జాతీయ కౌన్సిల్ స‌భ్యురాలిగా నియ‌మించారు. ఈ ప‌ద‌విలో ఆమె మూడు సంవ‌త్స‌రాలు కొన‌సాగుతారు. బీజేపీలో కీల‌క‌మైన జాతీయ కౌన్సిల్ పార్టీకి కీల‌క స‌మాచారం ఇవ్వ‌డంతోపాటు.. సూచ‌న‌లు, స‌ల‌హాలు కూడా ఇస్తుంది.

ఇక‌, ఇదే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జి. పద్మజారెడ్డికి కూడా పార్టీ ప్ర‌మోష‌న్ ఇచ్చింది. ఆమెను కూడా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా తీసుకున్నారు. ఆమె కూడా ఈ ప‌ద‌విలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఇలా.. బీజేపీ ఒకే జిల్లా నుంచి ఇద్ద‌రు మించి నాయ‌కుల‌ను ప‌ద‌వుల్లోకి తీసుకోవ‌డం వెనుక‌ మహబూబ్‌నగర్ జిల్లాపై ప్ర‌త్యేక దృష్టి పెడుతున్న‌ట్టుగా ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. పార్టీ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌కుమార్, కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు. వీరితోపాటు ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల‌కు జాతీయ‌స్థాయిలో ప‌ద‌వులు ఇవ్వ‌డం ద్వారా పార్టీని పుంజుకునేలా చేస్తార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

This post was last modified on July 3, 2025 11:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago