Political News

ఆ విష‌యం తేల్చ‌కుండా.. జ‌గ‌న్ తొంద‌ర‌ప‌డ్డారు!

వైసీపీ నాయ‌కుల్లో ఇప్పుడు ఈ చ‌ర్చే సాగుతోంది. ఆ విష‌యం తేల్చ‌కుండా.. జ‌గ‌న్ తొంద‌ర‌ప‌డ్డా రంటూ.. మెజారిటీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో నాయ‌కులు గ‌డప దాట‌డంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రోవైపు.. జ‌గ‌న్ పెట్టిన డెడ్ లైన్ కూడా దాటిపోయింది. ఇంటింటికీ వెళ్లి.. సీఎం చంద్రబాబు గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను గుర్తు చేయాల‌ని.. ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వంపై ఉసి గొల్పాల‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు.

దీనికి ఆయ‌న ఐదు వారాల గ‌డువు కూడా విధించారు. అయితే.. అస‌లు విష‌యం ఏంటంటే.. గ‌త ఎన్నికల స‌మ‌యంలో జ‌గ‌న్ 52 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను మార్చేశారు. ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ సెంట్ర‌ల్ లో ఇదే న‌గ‌రంలోని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఇక‌, సెంట్ర‌ల్ ఎమ్మెల్యే విష్ణును త్రిశంకు స్వ‌ర్గంలో ఉంచిన‌ట్టు ఉంచారు. అయితే.. వెల్లంప‌ల్లి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న యాక్టివ్‌గా కూడా ఉండ‌డం లేదు.

మ‌రోవైపు ప‌శ్చిమ‌లో మైనారిటీ ముస్లిం సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడికి అవ‌కాశం ఇచ్చారు. ఈయ‌న కూడా ఓడిపోయారు. త‌ర్వాత‌.. అస‌లు ఆయ‌న ఎక్క‌డున్నారో కూడా తెలియ‌డం లేదు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా 52 నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. ఎన్నిక‌లు ముగిసి ఏడాది అయినా.. స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జ్‌లను నియ‌మించ‌లేదు. పైగా.. ఓడిపోయిన వారిని యాక్టివ్ కూడా చేయ‌లేదు. పోనీ.. పాత‌వారిని తిరిగి వారి వారి స్థానాల‌కు కూడా పంపించ‌లేదు.

ఒక‌టి రెండు చోట్ల(ఉదాహ‌ర‌ణ‌కు గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు(ఎస్సీ), చిల‌క‌లూరిపేట‌(జ‌న‌ర‌ల్‌) అలా నియ మించినా.. వారు కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో బాధ్య‌త‌ల‌పై పార్టీ అధిష్టానం కీల‌క నిర్ణ‌యం తీసుకోకుండా.. ఇంటింటికీ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డంపై నాయ‌కులు విస్మ యం వ్య‌క్తం చేస్తున్నారు. ముందుగా ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు చేర్పు లు చేసిన త‌ర్వాత‌.. పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాల‌కు పిలుపునిస్తే బాగుండేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం తాడికొండ స‌హా ప‌లు చాలా నియోజ‌క వ‌ర్గాల్లో నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. కాబట్టి జ‌గ‌న్ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌ పై నిర్ణ‌యం తీసుకోవాల‌న్నది వైసీపీ నాయ‌కులు చెబుతున్న మాట‌.

This post was last modified on June 30, 2025 5:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

1 hour ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

5 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

5 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

7 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

8 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

9 hours ago