కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి ఢిల్లీ ఎయిర్ పోర్టులో అవమానం జరిగింది. అమెరికాకు వెళ్ళేందుకు విమానాశ్రయానికి వచ్చిన సుజనాను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అనేక బ్యాంకు ఫ్రాడు కేసుల విచారణను ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రిపై లుకవుట్ నోటీసు ఉన్న కారణంగా దేశం విడిచి వెళ్ళే అవకాశాలు లేవని అడ్డుకున్నారు. దాంతో అత్యతవసరంగా లంచ్ మోషన్ పద్దతిలో కోర్టులో పిటీషన్ వేసిన సుజనా చివరకు అమెరికాకు వెళ్ళటానికి రెండు వారాల అనుమతిని తెచ్చుకున్నారు.
ఇంతకీ ఏమి జరిగిందంటే అనేక బ్యాంకుల్లో అప్పులు తీసుకుని సుమారు రూ. 8 వేల కోట్లను ఎగొట్టిన అభియోగాలను సుజనా ఎదుర్కొంటున్నారు. అప్పులు ఎగొట్టిన విషయంలో బ్యాంకులు కేసులు కూడా పెట్టాయి. మారిషస్ బ్యాంకు నుండి తీసుకున్న రూ. 100 కోట్లను ఎగొట్టిన కేసులో కేంద్రమంత్రిగా ఉన్నపుడే నాంపల్లి కోర్టు అరెస్టు వారెంటు కూడా జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. బ్యాంకు ఫ్రాడ్ కేసుల్లో సుజనాపై 2018లోనే సీబీఐ మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది.
సుజనా బ్యాంకులను మోసం చేశారని, డొల్ల కంపెనీలు పెట్టి మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారనే అనేక అభియోగాల మీద ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్, ఇన్ కమ్ ట్యాక్స్ కూడా సుజనాపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. సుజనా ఆస్తులను ఎటాచ్ చేసుకోవటమే కాకుండా వేలం వేస్తున్నట్లు గతంలో బ్యాంకులు బహిరంగ నోటీసులు కూడా జారీ చేశాయి. ఇన్ని కేసులను ఎదుర్కొంటున్న సుజనాపై సీబీఐ 2018లోనే లుకవుట్ నోటీసు జారీ చేసింది. అంటే దీని ప్రకారం భారత్ ను విడిచి ఏ దేశానికి కూడా సుజనా వెళ్ళేందుకు లేదు.
ఇక్కడ గమనించాల్సిదేమంటే తనపై లుకవుట్ నోటీసు జారీ చేసిన విషయం సుజనాకు బాగా తెలుసు. తెలిసి కూడా ఈ కేంద్రమంత్రి ముందస్తు అనుమతులు తీసుకోకుండా అమెరికాకు వెళ్ళేందుకు ప్రయత్నించటమే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడైతే తనను ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డగించారో అప్పటికప్పుడు కోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు. సుజనా ఎంపి హోదాలో ఉన్నారు కాబట్టే రెండు వారాల పాటు అమెరికాలో పర్యటించేందుకు అనుమతిస్తున్నట్లు కోర్టు స్పష్టంగా చెప్పింది.
అయితే అమెరికా నుండి తిరిగి వచ్చిన వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. అలాగే తనపై జారీ అయిన లుకవుట్ నోటీసును రద్దు చేయాలన్న సుజనా కోరికను కోర్టు తోసిపుచ్చింది. లుకవుట్ నోటీసు రద్దు చేయటంతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పేసింది.
This post was last modified on November 14, 2020 11:58 am
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…