Political News

“మీ ఏడుపులే మాకు దీవెన‌లు జ‌గ‌న్ గారూ..“

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్-టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రినారా లోకేష్ మ‌ధ్య రాజ‌కీయ ఫైట్ తీవ్ర‌స్థాయిలో జ‌రుగుతోంది. ఎక్స్ వేదిక‌గా జ‌గ‌న్ చేసే కామెంట్ల‌కు, విమ‌ర్శ‌ల‌కు నారా లోకేష్ స్ట్రాంగ్ రిప్ల‌య్ ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌ల‌పై లోకేష్ స్పందిస్తూ.. “మీ ఏడుపులే మాకు దీవెన‌లు జ‌గ‌న్ గారూ..“ అని సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. “మీ ఏడుపులే మాకు దీవెనలు జగన్ మోహన్ రెడ్డి గారు! మీరు ఐదేళ్లు విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి పోయారు. నేను ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం చూసి మీకు కడుపుమంట రావడం సహజం.“ అని వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

రాష్ట్రంలో ఇంజ‌నీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, ఫార్మ‌సీ విద్యార్థుల ఎంట్రన్స్ ప‌రీక్ష‌లు ముగిసి.. 45 రోజులు అయ్యాయ‌ని.. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు వీటికి సంబంధించి కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌లేద‌ని జ‌గ‌న్ త‌న సామాజిక మాధ్య‌మం ఎక్స్‌లో పోస్టు చేశారు. రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ దారుణంగా మారింద‌ని చెప్ప‌డానికి ఇంత‌క‌న్నా ఉదాహ‌ర‌ణ ఇంకేం కావాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అన్ని విధాలా విద్యా వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేశార‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. త‌మ హ‌యాంలో ఎప్ప‌టిక‌ప్పుడు విద్యార్థుల‌కు మేలు చేశామ‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ పోస్టుపై మంత్రి నారా లోకేష్ అంతే తీవ్రంగా స్పందించారు.

“మీ హయాంలో ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టారో కూడా మీకు స్పృహ లేదు. కోవిడ్ తరువాత మీరు 2022 సెప్టెంబర్‌లో, 2023 జూలై చివరికి ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేసిన మీరు మమ్మల్ని విమర్శించటం మీ అజ్ఞానానికి నిదర్శనం.“ అని లోకేష్ చుర‌క‌లు అంటించారు. “మేము ప్రభుత్వంలోకి రాగానే ఈసెట్ మొదటి కౌన్సిలింగ్‌ని జూలై మూడో వారం కల్లా పూర్తి చేసాము. ఈ సంవత్సరం కూడా మొదటి కౌన్సిలింగ్‌ని జూలై మూడో వారానికి పూర్తి చేస్తాము. మా ప్ర‌భుత్వంపై మీ ఏడుపులు మాకు దీవెన‌లు“ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

This post was last modified on June 30, 2025 8:56 am

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

30 minutes ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

38 minutes ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

42 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

1 hour ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

1 hour ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago