వైసిపి అధినేత జగన్… కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా.. ఏం మాట్లాడినా.. షర్మిల తీవ్ర స్థాయిలో జగన్ ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. విషయం ఏదైనా జగన్ మాట ఉండాల్సిందే. జగన్ను విమర్శించాల్సిందే. ఇది ఇప్పుడే కాదు.. షర్మిల గత ఏడాదిన్నర కాలంగా అనుసరిస్తున్న బాట. అయితే. నిజంగానే షర్మిల ఈ లైన్ లో వెళ్లడం వల్ల ఆమె గ్రాఫ్ ఎలా ఉన్నా వైసిపికి భారీ నష్టమా? అంటే గత ఏడాది ఎన్నికలను గమనిస్తే నష్టపోయిన విషయం వాస్తవం.
ఎంతో కొంత షర్మిల వల్ల ఓటు బ్యాంకు దూరమైంది. మహిళలు దూరమయ్యారు. అయితే ఇప్పుడు రాబోయే పరిస్థితిని గమనిస్తే షర్మిలకు ఉన్న రాజకీయ అనుభవం, రాజకీయ పరిజ్ఞానం గమనిస్తే ఆమె చేస్తున్న విమర్శలు తరచుగా అన్నతో పాటు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తీరు వంటివి జగన్కు కూడా కలిసి వచ్చే అంశాలే అని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకటి షర్మిల వల్ల జగన్ కు కొంత నష్టం జరుగుతున్నా.. ఇకముందు మాత్రం ఆమె జగన్‌ను దాదాపు విమర్శించడం తగ్గించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జగను విమర్శించడం వల్ల ఓటు బ్యాంకు రావడం లేదనేది అదే విధంగా సీనియర్ నాయకులు కలిసి రావడం లేదనేది ఆమెకు అర్థమైంది.
పైగా ఆమెపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కూటమిని టార్గెట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది ప్రత్యక్షంగా కాంగ్రెస్కు మేలు చేస్తుందా అంటే కొత్త మేరకు చేయొచ్చు. కానీ ఎక్కువగా దీనివల్ల జగన్ కి మేలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కూటమి పాలనపై వైసీపీ ఇప్పటికే పోరుబాట పట్టింది. అయితే దీనికి మద్దతుగా షర్మిల కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం వల్ల జగన్ చెబుతున్నది వాస్తవమేనన్న మాట ప్రజలకు చేరువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రకంగా షర్మిల వల్ల కొన్ని మైనస్లు ఉంటే అదే షర్మిల వల్ల ఒకటి రెండు ప్లస్ లు కూడా వైసిపికి కనిపిస్తున్నాయి.
కాబట్టి పూర్తిస్థాయిలో షర్మిల వల్ల వైసీపీ కి ఇప్పట్లో పెద్ద నష్టమైతే కనిపించకపోవచ్చు.. గత ఏడాది అయితే నష్టపోయినా వచ్చే ఎన్నికల నాటికి షర్మిల చేస్తున్న యాంటీ ప్రచారం వైసిపి చేస్తున్న యాంటీ ప్రచారానికి పాలు నీళ్ళలాగా తోడ అయ్యే అవకాశం ఉంది. అలా అని వీరిద్దరు పొత్తు పెట్టుకుంటారని కాదు. ఒక యాంటీ ప్రచారం మొదలైనప్పుడు గత ఎన్నికల్లో టిడిపి జనసేన ఎలాగైతే యాంటీ ప్రచారం చేశాయో అలాగే ఇప్పుడు కూడా కాంగ్రెస్ వైసిపి యాంటీ ప్రచారం వల్ల వైసీపీకి మేలు జరుగుతుందని పరిశీలకులు వేస్తున్న అంచనా. మరి ఏం జరుగుతుందనేది భవిష్యత్తు తేల్చాలి.
This post was last modified on June 29, 2025 3:46 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…