చంద్రబాబు అధికారంలోకి వస్తే.. కూటమి పవర్ చేపడితే.. పేదలకు న్యాయం జరగదని.. పేదలను ప ట్టించుకోరని వైసీపీ గత ఎన్నికలకు ముందు అనేక రూపాల్లో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఒక ర కంగా ప్రజలను, పేదలను కూడా భయానికి గురి చేసింది. గతంలో కూడా పేదలను పట్టించుకోలేదంటూ.. కొన్ని ఉదాహరణలు కూడా చూపించింది. అయినా.. ప్రజలు వైసీపీని పట్టించుకోకుండా.. ఆ పార్టీ ప్రచారా న్ని పక్కన పెట్టి మరీ కూటమికి పట్టం కట్టారు.
కట్ చేస్తే.. కూటమి పాలనకు ఏడాది పూర్తయింది. మరి ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం పేదలను పట్టించుకుందా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తే.. ఒకవైపు అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే.. మరోవైపు పేదలకు ఈ ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తోంది. పేదల పక్షపాతిగా కూడా నిలుస్తోంది. ప్రధానంగా సంక్షేమమే కాకుండా..పేదల అభివృద్ధి కోణంలోనూ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి.
1) పింఛన్ల పెంపు: సామాజిక భద్రతా పింఛన్లను రూ.1000 పెంచి రూ.4000 చొప్పున ఠంచనుగా నెల నెల 1నే అందిస్తున్నారు. వీటిని అందుకుంటున్నవారు ఫక్తు పేదలేనన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తద్వారా వారిలో ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు కూటమి సర్కారు ప్రయత్నం చేస్తోంది.
2) గ్యాస్ సిలిండర్లు: ఏటా మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గత ఏడాది అక్టోబరులో ప్రారంభించిన ఈ పథకం కింద.. ఇప్పటికి రెండు సిలిండర్లను పేదలు సొంతం చేసుకున్నా రు. తద్వారా కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారాలను తగ్గించుకున్నారు.
3) పన్నుల ఎత్తివేత: వైసీపీ హయాంలో ప్రతి ఇంటికీ చెత్తపై పన్ను విధించారు. కూటమి సర్కారు దీనిని తీసేసింది. తద్వారా.. కనీసంలో కనీసం.. ఏటా 800 చొప్పున పేదలకు మేలు కలుగుతోంది. నెలకు రూ. 70 చొప్పున వేసుకున్నా ఏడాదికి పేదలపై భారం 840 చొప్పున తగ్గింది.
4) ఇంటి నిర్మాణానికి రూపాయే: పేదల ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చే ప్రక్రియలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీ, జీ+1 నివాసాలపై ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క రూపాయికి అనుమతులు మంజురు చేసేలా నిర్ణయం తీసుకుంది. దీనిని త్వరలోనే అమలు చేయనున్నారు.
5) అన్న క్యాంటీన్లు: రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను 213 ఏర్పాటు చేశారు. ఇంకా ఏర్పాటు చేస్తున్నారు. రూ.5కే టిపిన్, భోజనం అందించే ఈ క్యాంటీన్లతో పేదలకు ఆకలి తీరుతోంది. ఇది మేలైన పరిణామంగా కూడా ప్రజల మధ్య చర్చ నడుస్తోంది. ఇలా.. పేదల పక్షపాతిగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.
This post was last modified on June 26, 2025 6:58 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…