ఇంటింటికి వైసీపీ పేరుతో వైసిపి అధినేత జగన్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక లక్ష నిర్దేశం చేశారు. రాజకీయాల్లో ప్రజలను కలుసుకోవడం, ప్రజా సమస్యల ప్రస్తావించడం, వారి సమస్యలపై పోరాటం చేయటం అనేది ప్రతిపక్షంగా నాయకులు చేయాల్సిన కర్తవ్యం. వాస్తవానికి చెప్పాలంటే 2019లో టిడిపి అధినేత చంద్రబాబు కేవలం 6 మాసాల గడువు లోపే ప్రజల మధ్యకు వచ్చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన తూర్పారబట్టారు. ఆయనతో పోల్చి చూసుకుంటే జగన్ చాలా లేట్ చేశారని చెప్పాలి.
ఇప్పటికే పలుమార్లు ప్రజల మధ్యకు వస్తానని చెప్పి ఆయన రాకపోవడం, నాయకులను, కార్యకర్తలను పంపించే ప్రయత్నం చేసిన అది కూడా సక్సెస్ కాకపోవడం వంటివి పార్టీలోను బయట రాజకీయ వర్గాల్లోనూ చర్చ గా మారింది. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు మేనిఫెస్టోను రీకాల్ చేస్తూ ప్రజల మధ్యకు వెళ్లాలని జగన్ పెట్టుకున్న లక్ష్యంగా కనిపించింది. తద్వారా 2024 ముందు ఇచ్చినటువంటి హామీలు, చేస్తామన్న పనులు, ఎన్నికల తాయిలాలు వంటివి తిరిగి ప్రజలకు గుర్తు చేయాలనేది జగన్మోహన్ పెట్టుకున్న లక్ష్యం.
అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు విఫలం అవుతుంది అనేది పక్కన పెడితే కీలకమైన వైసిపి ఓటు బ్యాంకుకు మాత్రం ఇది ఎంతో కొంత మేలు చేస్తుంది అనేది పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎలా అంటే.. గత ఎన్నికల్లో జగన్ కన్నా ఎక్కువగా తమకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో వైసిపికి అనుకూలంగా ఉన్న కొన్ని కుటుంబాలు టిడిపికి ఓటు వేసి ఉంటే లేదా కూటమికి ఓటు వేసి ఉంటే ఇప్పుడు ఆయా వర్గాలు తిరిగి వైసిపికి అనుకూలంగా మారేందుకు ఈ ఇంటింటికి కార్యక్రమం కచ్చితంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
తద్వారా ఇది భవిష్యత్తులో వైసీపీకి మేలు చేస్తుంది అనేది పరిశీలకుల అంచనా. ఇది పూర్తి స్థాయిలో మేలు చేస్తుందా.. పరోక్షంగా మేలు చేస్తుందా అనేది పక్కన పెడితే మొత్తానికి ప్రజల్లోకి అయితే వైసీపీకి ఒక ఇమేజ్ పెరుగుతుందనేది, అదే విధంగా కూటమి సర్కారుకు కూడా మరోవైపు ఒత్తిడి పెరిగి పథకాలను అమలు చేయడమా లేకపోతే ఎదురు దాడి చేయడం అనేది తేల్చుకునే పరిస్థితి వస్తుందని అంచనా కూడా వినిపిస్తోంది. ఎలా చూసుకున్నా జగన్ చాలా వ్యూహాత్మకంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెబుతున్నారు.
సహజంగా ఇదే కార్యక్రమాన్ని ఒక ఆరు నెలల ముందే ప్రారంభించి ఉంటే ఆ ప్రభావం పెద్దగా ఉండేది కాదు. కానీ ఏడాది తర్వాత ఇచ్చిన హామీలపై నిలదీయాలని లేదా ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునివ్వడం ద్వారా వైసిపి వ్యూహం పనిచేయనుంది. ఇది ఒక రకంగా పార్టీకి ఉపయోగపడుతుంది. ఇక ప్రభుత్వం పరంగా ఎదురయ్యే సమస్యలు ప్రభుత్వం ఎలా డిఫెన్స్ చేసుకుంటుంది అనేది ఆ పార్ట్ వేరుగా ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష కోణంలో చూసినప్పుడు జగన్ చేస్తున్న ఈ ప్రయత్నం లో ఎలాంటి తప్పుగాని అతిశయోక్తిగాని ఏమాత్రం లేదని చెప్పాలి.
This post was last modified on June 26, 2025 4:09 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…