ఏపీ సీఎం చంద్రబాబుకు అన్నీ కలిసి వస్తున్నాయి. కేంద్రం నుంచి సహకారం అందుతోంది. పనులు వేగం గా పూర్తవుతున్నాయి. ప్రాజెక్టుల పనులు సాగుతున్నాయి. అంతేకాదు.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా సకాలంలో అందుతున్నాయి. ఇలా.. కలిసొచ్చే కాలంగా చంద్రబాబుకు అన్నీ సకాలంలో జరుగుతు న్నాయి. ఇక, ఇప్పుడు కీలకమైన ఫిక్కీ కూడా.. చంద్రబాబుతో కలిసి నడిచేందుకు, రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ముందుకు వచ్చింది.
ఏంటీ ఫిక్కీ..
ఫిక్కీ అంటే.. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య. భారీ ఎత్తున పరిశ్రమలకు అధిపతులుగా ఉన్నవారు… దీనిలో సభ్యులుగా ఉంటారు. తాజాగా వీరు విజయవాడలో సమావేశం అయ్యారు. దీనికి సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో సాగుతున్న పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు. తాము కూడా సహకరిస్తామని.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తామని తేల్చి చెప్పారు.
ముఖ్యంగా పీ-4 పథకం పై ఫిక్కీలో సభ్యులుగా ఉన్న పారిశ్రామిక వేత్తలు మక్కువ చూపించారు. ప్రధానం గా సర్ణాంధ్ర- 2047 విజన్ పై ఆసక్తి చూపించారు. దీనికి పూర్తిస్థాయిలో తమ సహకారం ఉంటుందని తేల్చి చెప్పారు. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి విషయంలో దోహదపడతామని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగేలా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు ఖుషీ అయ్యారు.
ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇస్తున్నామని.. పెట్టుబడులు పెట్టేవారికి రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. పెట్టుబడులకు సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేయనున్నట్టు వివరించారు. దీంతో ఫిక్కీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు.
This post was last modified on June 25, 2025 3:28 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…