దేశంలో ఎమర్జెన్సీ.. అంటే అత్యయిక స్థితిని విధించి జూన్ 25 (బుధవారం) నాటికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయం.. దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. అంతేకాదు, గాంధీల కుటుంబ చరిత్రలో కూడా ఇది మాయమైన మచ్చగా మారింది. మరి అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఎందుకు విధించారు? అప్పట్లో ఏం జరిగింది? అనే కీలక విషయాలు ఇప్పుడు చూద్దాం..
ఎమర్జెన్సీ అంటే ఏంటి?
భారత రాజ్యాంగంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాల్లోనూ ఎమర్జెన్సీ అనే నిబంధన లేదా ఆర్టికల్ ఉంటుంది. ఆయా దేశాల్లో అంతర్యుద్ధాలు జరిగినప్పుడు, తీవ్ర స్థాయి మత కలహాలు, జన హననాలకు అవకాశం ఉన్నప్పుడు, ప్రజలు కల్లోల పరిస్థితులను ఎదుర్కొనే స్థితి నెలకొన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాల సిఫారసు మేరకు రాష్ట్రపతి ఎమర్జెన్సీని విధిస్తారు. తద్వారా అధికారం మొత్తం రాష్ట్రాల నుంచి కేంద్రం తీసుకుని పరిస్థితిని చక్కదిద్దుతుంది. ఇదీ ఎమర్జెన్సీకి అర్ధం.
మన దేశంలో..
మన దేశ రాజ్యాంగంలో ఆర్టికల్ 352(1) ఎమర్జెన్సీని నిర్వరించింది. దీనికి కొన్ని పరిమితులు, హద్దులు కూడా ఉన్నాయి. కేంద్రం సిఫారసు చేసే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పైగా దేశంలోని 75 శాతం రాష్ట్రాల్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నప్పుడు మాత్రమే, అది కూడా పరిమిత రోజులకు మాత్రమే ఎమర్జెన్సీని విధించాలని పేర్కొంది. దీనిపై పూర్తి బాధ్యత రాష్ట్రపతిపైనే ఉంటుంది. కేంద్రం సిఫారసు చేసినా, దీనిని తిరస్కరించడానికి లేదా అనుమతించడానికి సంపూర్ణ అధికారాలు రాష్ట్రపతికే ఉన్నాయి.
ఇందిరమ్మ హయాంలో..
మన దేశంలో ఎమర్జెన్సీని 1975 జూన్ 25 అర్ధరాత్రి నుంచి 1977 మార్చి 21 వరకు విధించారు. ఇది ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలలోనే అత్యధిక కాలం విధించిన ఎమర్జెన్సీగా చరిత్రకారులు చెబుతారు.
1971 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 352 సీట్లు గెలుచుకుని భారీ విజయం సాధించింది. ఇందిరా గాంధీకి అపరిమిత అధికారం వచ్చింది. కానీ, ఈ అధికారం దుర్వినియోగానికి దారి తీసింది. రాజ్యాంగ సవరణలు, ప్రజా హక్కుల హరణ, రాజకీయ వ్యతిరేకుల అరెస్టులు మొదలైన చర్యలు దేశవ్యాప్తంగా వ్యతిరేకతను పెంచాయి.
కోర్టుల తీర్పు, ప్రజా ఆందోళనలతో..
1971 ఎన్నికల్లో ఓడిపోయిన రాజ్ నారాయణ్, ఇందిరమ్మ విజయాన్ని చాలెంజ్ చేస్తూ కేసు వేశారు. 1975 జూన్ 21న అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. ఇదే సమయంలో ప్రజల్లో గల అశాంతి, కోర్టుల తీర్పులతో ఖంగుతిన్న ఇందిరా గాంధీ, జూన్ 25 సాయంత్రం 6 గంటల తర్వాత ఎమర్జెన్సీ విధించేందుకు రాష్ట్రపతికి లేఖ పంపించారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ వెంటనే సంతకం చేశారంటూ చరిత్రలో ఉంది.
ఏం జరిగింది?
ఎమర్జెన్సీ అమలుతో ప్రభుత్వ అధికారాలు అపరిమితంగా మారాయి. పత్రికలపై నిషేధం, ప్రజా హక్కుల హరణ, రాజకీయ వ్యతిరేకుల అరెస్టులు, ప్రజాస్వామ్య సమావేశాలపై ఆంక్షలు కొనసాగాయి. ఇది దేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయంగా నిలిచింది. మొత్తానికి, ఇది 21 నెలలు కొనసాగింది.
This post was last modified on June 25, 2025 2:24 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…