Political News

జ‌గ‌న్‌ పై అభిమానం.. త‌ల్లిదండ్రులకు శాపమా?

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తల్లులకు ఎనలేని ప్రేమ ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతారు. దీనికి కారణం రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎప్పుడు లేని విధంగా ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా 2019-24 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో 15 వేల రూపాయలు చొప్పున ఏటా పిల్లల చదువులకు వెచ్చించింది. ఆ నిధులను నేరుగా తల్లుల ఖాతాల్లోనే వేసింది. అంతేకాదు విద్యా దీవెన పేరుతో ఉన్నత స్థాయి చదువులు చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులను కూడా తల్లుల ఖాతాల్లోనే వేసింది.

తద్వారా తల్లులను వైసీపీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. సహజంగా ఏ ప్రభుత్వమైనా ఒక పథకాన్ని అమలు చేస్తే తద్వారా లబ్ధిని ఆశించడం తప్పు కాదు. జగన్ చేసింది కూడా. అదే అమ్మబడి ఫీజు రియంబర్స్మెంట్ వంటి కీలక నగదు బదిలీ పథకాల ద్వారా అమ్మల మనసు దోచుకునే ప్రయత్నం చేశారు. అందుకే వైసిపి నాయకుల నుంచి అధినేత జగన్ వరకు అమ్మలంతా మాతోనే ఉన్నారని చెప్పుకునేవారు. ఇప్పటికీ చెబుతున్నారు కూడా. నిజానికి రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున నగదు బదిలీ పథకాలు అమలు చేయడం అనేది జగన్ హయాంలోనే జరిగింది.

ఇది ఎవరు కాదన లేని వాస్తవం. దీంతోనే తల్లులకు సంబంధించిన సానుభూతి క్రెడిట్ అంతా కూడా తమకే దక్కుతుందని వైసిపి నాయకులు అంచనా వేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. తల్లులందరూ వైసిపి ఓ పట్ల ఉన్నారనే అనుకుందాం. కానీ, ఇప్పుడు అదే తల్లులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా జగన్ కారణంగా తమ పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారని విచ్చలవిడిగా చేస్తున్న కార్యక్రమాలతో పోలీసులతో దెబ్బలు తింటున్నారని త‌ల్లులు వాపోతున్నారు.

జగన్ అంటే క్రేజీ ఉండొచ్చు. జగన్ అంటే అభిమానం ఉండొచ్చు. అయితే జగన్ చేస్తున్న వ్యాఖ్యలు రెచ్చగొడుతున్న విధానాలు ఆయన దూకుడు స్వభావం కారణంగా యువత పక్కదారి పడుతున్న విషయం గడిచిన నెల రోజులుగా కనిపిస్తూనే ఉంది. పొదిలి ప్రాంతంలో జగన్ పర్యటించినప్పుడు అనేక మంది యువత రోడ్లమీదకు వచ్చి రాళ్లు చెప్పులతో మహిళలపై దాడులు చేశారు. మీరంతా జగన్ చేసిన వ్యాఖ్యలతో రెచ్చిపోయారనేది వారి తల్లిదండ్రులే చెబుతున్న మాట. అయితే రాళ్లు చెప్పులు విసిరిన వారిపై పోలీసులు తీవ్ర నేరాల కింద కేసులు పెట్టారు.

పదుల సంఖ్యలో యువతను అరెస్టు చేశారు. అంతేకాదు పోలీస్ స్టేషన్లో వారిపై లాఠీ చార్జి కూడా జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మా పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టడం కారణంగా పోలీసులు తమ పిల్లలను కొడుతున్నారని తల్లిదండ్రులు బాధపడుతున్నారు.

ఇక తాజాగా గుంటూరు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో జగన్ పర్యటించిన సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలు కారణంగా యువత రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే సినిమా డైలాగులను ప్లకార్డులపై రాసి ప్రదర్శించటం తొడలు కొట్టడం జబ్బలు చర్చడం ప్రభుత్వం పై విమర్శలు గుప్పించటం వంటివి చేశారు. రోడ్లపై నానా నానా బీభత్సం సృష్టించారు. అంతేకాదు ప్రభుత్వానికి సవాళ్లు కూడా రువ్వారు. ఈ విషయాలన్నీ రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులు పదుల సంఖ్యలో యువతను అదుపులోకి తీసుకుని స్టేషనులకు తరలించి రోజుల తరబడి వేధించారని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

వీటంతటికీ కారణం జగన్ అని చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆవేదన కట్టలు తెగుతోంది. జగన్ కారణంగా తమ పిల్లలు రోడ్డున పడుతున్నారని పోలీసులతో దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే తమ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుందని ఆందోళన చెందుతున్నారు. పోలీస్ కేసులు పెడితే రేపు ఉద్యోగాలు రావని జీవితాలు నాశనం అవుతాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. పైకి ఎవరూ చెప్పుకోలేకపోయినా అంతర్గతంగా కుమిలిపోతున్నారు. గ్రామాల్లోను పట్టణాల్లోనూ ఇద్దరు కలిసిన యువతను జగన్ నాశ‌నం చేస్తున్నాడ‌నే మాట స్పష్టంగా వినిపిస్తోంది. దీంతో తల్లులు తీవ్రంగా కుమిలిపోతున్నారు. మరి జగన్ ఇప్పటికైనా తెలుసుకొని తల్లుల సానుభూతి పోతుందన్న విషయాన్ని ఆయన గ్రహిస్తే మంచిదని పరిశీలకులు చెబుతున్నారు.

This post was last modified on June 21, 2025 11:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

48 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago