గోదావరి నుంచి ఏటా సముద్రంలో వృథాగా కలుస్తున్న జలాల ఆధారంగా ఏపీ నిర్మించతలపెట్టిన బానకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత, సాగునీటి శాఖ మాజీ మంత్రి హరీశ్ రావుల మధ్య మాటల తూటాలు ఇంకా పేలుతూనే ఉన్నాయి. బానకచర్ల విషయంలో అయినా, ఇంకే ప్రాజెక్టు విషయంలో అయినా పొరుగు రాష్ట్రాలతో గొడవలు అవసరం లేదని, సామరస్యపూర్వకంగానే పరిష్కరించాలని నిర్ణయించినట్లుగా రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ విషయంలో తానే ఓ అడుగు ముందుకేసీ ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరుపుతానన్నారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్ ఘాటుగా స్పందించారు.
అయినా బీఆర్ఎస్ మీదా, నాటి సీఎం కేసీఆర్ మీదా రేవంత్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని హరీశ్ మండిపడ్డారు. గోదావరి నుంచి సముద్రంలో కలిసే 3 వేల టీఎంసీల్లోనూ తెలంగాణ వాటాగా 1,950 టీఎంసీలను ఇవ్వాలని కేసీఆర్ నాడే అడిగారని ఆయన చెప్పారు. అంతేకాకుండా సాధారణంగా గోదావరిలో లభించే 968 టీఎంసీలతో కలుపుకుని మొత్తంగా 2,918 టీఎంసీల వాటాను నాడు కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు. అయతే ఇప్పుడు రేవంత్ మాత్రం గోదావరిలో కేవలం 1,000 టీఎంసీలు ఇస్తే చాలునని, బానకచర్లకు తాము ఎలాంటి అబ్యంతరం చెప్పబోమని చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబుతో చర్చలు జరుపుతామన్న రేవంత్ వ్యాఖ్యలతోనూ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర బయట పడిపోయిందని కూడా హరీశ్ రావు ఆరోపించారు. ముందుగానే చంద్రబాబుతో చర్చలు జరిపిన తర్వాతే రేవంత్ రెడ్డి ఈ మాటలు మాట్టాడుతున్నారని బావించాల్సి వస్తోందని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో రేవంత్ రెడ్డి లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందని కూడా ఆయన ఆరోపించారు. కేబినెట్ భేటీ, ఆ తర్వాత చంద్రబాబుకు చర్చల కోసం ఆహ్వానం ముందుగా కుర్చుకున్న ఫిక్సింగ్ లో భాగమేనని హరీశ్ ఆరోపించారు.
This post was last modified on June 20, 2025 10:45 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…