Political News

బనకచర్ల తో జగన్ కు ఇబ్బందే!

వైసీపీ అధినేత జగన్ మెడకు భారీ ఉచ్చే బిగుసుకుంటోంది. ఇప్పటి వరకు ఆయనను రాజకీయంగానే టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం.. తాజాగా ఆయనను సీమకు కీలకమైన బనకచర్ల ప్రాజెక్టు విషయంలోనూ ఇరుకున పెట్టే వ్యూహానికి తెరదీసింది. ఇప్పుడు ఆయన స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వైసీపీ అధినేత జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ.. మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన గర్జన వెనుక పక్కా రాజకీయ వ్యూహం ఉందనేది పరిశీలకులు చెబుతున్న మాట. దీనిపై జగన్ నోరు విప్పాల్సిందేనన్న వాదన కూటమి పార్టీల నుంచి ఇక తీవ్రతరం కానుంది.

అసలేంటీ ప్రాజెక్టు..?

కర్నూలు జిల్లాలోని బనకచర్ల గ్రామం వద్ద సాగు, తాగు నీటి ప్రాజెక్టును నిర్మించాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. వాస్తవానికి ఈ ప్రతిపాదన గతంలో లేదు. సీఎంగా చంద్రబాబు నాలుగో సారి బాధ్యతలు చేపట్టాక.. కర్నూలులో పర్యటించినప్పుడు ఈ ప్రతిపాదనకు అంకురార్పణ జరిగింది. బనకచర్లలో ప్రాజెక్టును నిర్మించడం ద్వారా గోదావరి నదీ జలాలను.. పోలవరం నుంచి బనకచర్లకు తరలిస్తారు. తద్వారా సముద్రంలోకి వృథాగా పోతున్న 1100 టీఎంసీల జలాలను ఇక్కడ ఒడిసి పట్టి కర్నూలు సహా.. సీమలోని పలుప్రాంతాలకు మళ్లిస్తారు. దీంతో ఇక్కడ సాగు, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చేస్తారు. ఇదీ.. ఇతమిత్థంగా ప్రాజెక్టు స్వరూపం.

దీనికి దాదాపు 80 వేల కోట్ల రూపాయల అంచనా వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నాలు మాత్రమే జరుగుతున్నాయి. కేంద్రమే పూర్తిగా నిధులు ఇవ్వాలని.. ప్రాజెక్టును తాము నిర్మించుకుంటామని చంద్రబాబు పదే పదే ఢిల్లీ పెద్దలకు చెబుతున్నారు. అయితే.. ఈ విషయం గుప్పుమనగానే తెలంగాణ నుంచి వ్యతిరేకత ప్రారంభమైంది. అక్కడి అధికార పక్షం కూడా ఇప్పటికే కేంద్రం వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేసింది. ఇక ప్రతిపక్షం బీఆర్‌ఎస్ కూడా.. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బనకచర్లను నిర్మించి తీరుతామన్న తమ మాట ఏమవుతోందన్న చర్చ కూడా కూటమిలో ఉంది.

జగన్ ప్రస్తావన ఎందుకు..?

అయితే.. కీలకమైన బనకచర్ల విషయంలో అఖిలపక్షాన్ని కూడగట్టి ముందుకు సాగితే.. కొన్ని ఇబ్బందులు తప్పుతాయి. అయితే.. కలిసివచ్చేందుకు వైసీపీ సిద్ధంగా లేదు. రాజకీయంగా ఉన్న వైరుధ్యాలు, వైషమ్యాల కారణంగా.. కూటమి పార్టీలకు.. వైసీపీకి మధ్య తేడా ఉంది. దీంతో సీమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. తెలంగాణ సంధిస్తున్న ప్రశ్నలకు సీమ ప్రాంతానికి చెందిన నాయకుడిగా జగన్ స్పందించాలన్నది కూటమి వ్యూహం. అందుకే.. నిమ్మల రామానాయుడు తీవ్రంగానే స్పందించారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా.. సీమ ప్రాంతానికి చెందిన నేతగా జగన్ ఎందుకు స్పందించడం లేదని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే.. గతంలో తాము చేపట్టిన సీమ ఎత్తిపోతల విషయంలో టీడీపీ కలిసి రాని విషయాన్ని వైసీపీ తెరమీదికి తెస్తోంది. ఏదేమైనా.. ఇప్పుడు జగన్ చుట్టూ బనకచర్ల ఉచ్చు అయితే.. ముసురుతోంది. మరి ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారో.. చూడాలి.

This post was last modified on June 20, 2025 1:54 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

1 hour ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

3 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago