తమిళ నటుడు విజయ్ సేతుపతికి ఆ రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ముఖ్యంగా తెలుగు వాళ్లలో అతణ్ని అభిమానించే వారి సంఖ్య పెద్దదే. ఇతర భాషా చిత్రాలను కూడా బాగా చూసే తెలుగు వారికి సేతుపతి ‘సైరా’, ‘ఉప్పెన’ చిత్రాల్లో నటించడానికి ముందే పరిచయం. ఇక ఈ రెండు చిత్రాలతో అతను మనవాళ్లకు మరింత చేరువ అయ్యాడు. ముఖ్యంగా ‘ఉప్పెన’ అతడికి ఇక్కడ మాంచి ఫాలోయింగ్ సంపాదించిపెట్టింది. ఆ తర్వాత తమిళంలో అతను నటించే సినిమాలు వరుసగా తెలుగులోకి అనువాదం అవుతున్నాయి. ఐతే మిగతా చిత్రాలేవీ వర్కవుట్ కాలేదు కానీ.. గత ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ‘మహారాజ’ మాత్రం మన వాళ్లకు తెగ నచ్చేసింది.
థియేటర్లలో మంచి ఫలితాన్నందుకున్న ఈ చిత్రం.. ఓటీటీలో రిలీజయ్యాక అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. కొన్ని నెలల పాటు ఓటీటీలో ‘మహారాజ’ తెలుగు వెర్షన్ సైతం బాగా ట్రెండ్ అయింది. ఈ రోజుల్లో ప్రతి హిట్ సినిమాకూ ప్రేక్షకులు సీక్వెల్ ఆశిస్తున్నారు. ‘మహారాజా’ ఫ్యాన్స్‌కు కూడా ఆ ఆశ ఉంది. దాన్ని విజయ్ సేతుపతి, దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ నెరవేర్చబోతున్నారన్నది కోలీవుడ్ టాక్.
‘మహారాజ’తోనే దర్శకుడిగా పరిచయం అయిన నిథిలన్‌కు స్టార్ల నుంచి చాలానే ఆఫర్లు వచ్చినా అతను కొత్త సినిమాను ప్రకటించలేదు. నిథిలన్ మళ్లీ సేతుపతితోనే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అది కూడా మహారాజ సీక్వెలేనట. ప్రస్తుతం స్క్రిప్టు పనులు చివరి దశలో ఉన్నాయని.. నిథినల్ ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇవ్వడానికి సేతుపతి రెడీగా ఉన్నాడని.. త్వరలోనే సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ‘మహారాజ’ సౌత్ ఇండియాలోనే కాదు.. చైనాలోనూ అదిరిపోయే వసూళ్లు సాధించడం విశేషం. ఈసారి చాలా పెద్ద స్థాయిలో సినిమా రిలీజవుతుందనడంలో సందేహం లేదు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. వందల కోట్లు వసూళ్లు రావడం లాంఛనమే.
This post was last modified on June 20, 2025 1:54 pm
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…