తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ వెళుతున్న వైనంపై విపక్షాలు.. ప్రత్యేకించి బీఆర్ఎస్ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఈ విమర్శలపై పలుమార్లు తనదైన శైలి సమాధానం ఇచ్చిన రేవంత్ తాజాగా బుధవారం నాటి అఖిలపక్ష సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. తన ఢిల్లీ టూర్లపై విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ కు ఆయన దిమ్మితిరిగే రితిలో అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ఆయా ప్రాజెక్టులకు అనుమతులు కేంద్రం కాకుంటే… ఎర్రవలి ఫామ్ హౌస్ లో కూర్చున్న మీరు ఇస్తారా? అంటూ ఆయన సెటైర్లు సంధించారు.
తెలంగాణ ఆవిర్భవించాక పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్… ధనిక రాష్ట్రాన్ని కాస్తా అప్పుల రాష్ట్రంగా మార్చారని రేవంత్ ఆరోపించారు. అంతేకాకుండా కేసీఆర్ చేసిన అప్పులన్నీ 11 శాతానికి చేసినవేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ అనుమతులు లేక రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చిన్నచిన్న రోడ్లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు కావాలంటే… ఎక్కడికెళ్లాలని ఆయన ప్రశ్నించారు. మెట్రో మలి దశ పనులకు నిధులు, అనుమతుల కోసం ఎక్కడికి వెళ్లాలని రేవంత్ బీఆర్ఎస్ నేతలను నిలదీశారు.
బీఆర్ఎస్ చేసిన అప్పుల వడ్డీలను 7 శాతానికి తగ్గించుకునే యత్నం చేస్తున్నామన్న రేవంత్.,..అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తున్నామన్నారు. ఇక నిలిచిన రోడ్లను పూర్తి చేసేందుకు అటవీ అనుమతుల కోసం సంబంధింత శాఖ మంత్రిని కలుస్తున్నామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు, నిధుల విషయంలో ఉపరితల రవాణా శాఖ మంత్రిని కలవకుండానే పనులు అవుతాయా? అని ఆయన ప్రశ్నించారు. ఇక మెట్రో విస్తరణకు డిల్లీలో ప్రదానిని కలవకుంటే అనుమతులు వస్తాయా? అని రేవంత్ ఫైరయ్యారు.
చివరాఖరుగా… తాను ఢిల్లీ వెళుతుంటే బీఆర్ఎస్ కు ఇబ్బందిగా ఉంటే… ఈ పనులన్నింటినీ సాధించేందుకు తాను ఎక్కడికి వెళ్లాలో ఆ పార్టీ నేతలే చెప్పాలని కూడా రేవంత్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్న ఎర్రవలి ఫామ్ హౌస్ కు వెళితే…పని అవుతుందంటే… అక్కడికే వెళ్లడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా రేవంత్ ఘాటు వ్యాఖ్య చేశారు. బాగానే వెనకేసుకున్నారు కదా… అందులో నుంచి ఓ రూ.50 వేల కోట్లు పెడితే… సరిపోతుంది కదా అని ఆయన అన్నారు. ఎర్రవలి ఫామ్ హౌస్ వద్ద పని అవుతుందంటే… తనతో పాటు తన కేబినెట్ కూడా కుర్చీలు వేసుకుని వంతుల వారీగా అక్కడే కూర్చుంటామని రేవంత్ సెటైర్లు సంధించారు.
This post was last modified on June 19, 2025 11:32 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…