వైసీపీ అధినేత జగన్ గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని రెంటపాళ్లలో ఈ రోజు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తాడేపల్లి నుంచి భారీ ఎత్తున కాన్వాయ్‌తో బయలు దేరారు. పోలీసులు కేవలం 100మంది కార్యకర్తలకు, 30 మంది నాయకులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయినప్పటికీ.. జగన్ ఆయన అనుచరులు మాత్రం వందల సంఖ్యలో బయలు దేరారు. రహదారి పొడవునా సుమారు 70 కిలో మీటర్ల మేరకు రోడ్ షో నిర్వహిస్తూ.. ముందుకు సాగారు.
అయితే.. జగన్ కాన్వాయ్ వాహనాలపైనా పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. కేవలం మూడు వాహనా లకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. కానీ, పదుల సంఖ్యలో వాహనాలు జగన్‌ను అనుసరిం చాయి. ఈ క్రమంలో ఓ వృద్ధుడిని కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీ కొట్టింది. అయితే.. వృద్ధుడిని ఢీ కొట్టిన విషయం కాన్వాయ్ సిబ్బంది గుర్తించారో లేదో తెలియదు కానీ.. అతనిని వదిలేసి తమ మానాన తాము వెళ్లిపోయారు. దీంతో రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి తీవ్ర గాయాలతో వృద్ధుడు పడిపోయాడు.
గుంటూరు సమీపంలోని ఏటుకూరు బైపాస్ దగ్గర ఘటన జరిగింది. అయితే.. విషయం తెలిసిన స్థానిక రైతులు.. వృద్ధుడిని బయటకు తీసుకువచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు.. వృద్ధుడిని ఓ ఆటోలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. తీవ్రగాయాలతో అప్పటికే తీవ్రంగా రక్తం కోల్పోయిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates