ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మద్యం కుంభకోణంలో మంగళవారం అనూహ్యంగా ఓ కొత్త స్టోరీ వినిపించింది. ఈ స్టోరీ కొత్తదిగానే కాకుండా వింతగానూ ఉందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటిదాకా కనీసం నోటీసులు కూడా జారీ కాని వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గత కొంత కాలంగా తనను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఆరోపణల్లో బాగంగానే ఆయనకు పదేళ్ల పాటు గన్ మన్ గా వ్యవహరించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఈ వింత కథను వినిపించారు.
ఆర్మ్ డ్ రిజర్వ్ డ్ కేటగిరీలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మదన్ రెడ్డి..చెవిరెడ్డికి పదేళ్లకు పైగా గన్ మన్ గా పనిచేశారట. ఇప్పుడు మదన్ రెడ్డిని మద్యం సిట్ అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. ఈ సందర్భంగా తనను బలవంతం చేశారని, తప్పుడు స్టేట్ మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేశారని, ఏకంగా దాడి కూడా చేశారని మదన్ రెడ్డి ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఆ పిటిషన్ లోని అంశాలతో కూడిన లేఖను ఆయన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఢిజీపీ గుప్తాలకు పంపారు.
ఈ లేఖలో మదన్ రెడ్డి ఏమంటారంటే… మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి పాత్రను నిర్ధారించుకునేందుకు సిట్ అధికారులు మదన్ రెడ్డిని విచారణకు పిలిచారు. ఈ విచారణకు మదన్ రెడ్డి యూనీఫాంలో వెళ్లినందుకు ఆయనను సిట్ అధికారులు తిట్టారట. ఇక మద్యం కుంభకోణంలో చెవిరెడ్డికి పాత్ర ఉందని చెప్పమని ఒత్తిడి తీసుకొచ్చారట. మదన్ కంటే ముందు విచారణకు హాజరైన మరో ఏఆర్ కానిస్టేబుల్ తాము చెప్పినట్టే విన్నారని వారు మదన్ కు చెప్పారట. అయితే తప్పుడు స్టేట్ మెంట్ ను తాను ఇవ్వలేనని మదన్ చెప్పగా… సిట్ కు చెందిన 10 అధికారులు ఆయనపై మూకుమ్మడి దాడి చేశారట. ఈ దాడిలో ఆయన గాయపడ్డారట. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇకపై విచారణకు తాను ఒంటరిగా వెళ్లలేనని, లాయర్ ను అనుమతిస్తేనే వెళతానని, ఆ దిశగా ఉత్తర్వులు ఇవ్వాలని మదన్ కోర్టును కోరారు.
అయినా కోర్టులో ఎంతో ప్రభావవంతంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా ఓ కానిస్టేబుల్ ను ఆయన సొంత శాఖ అధికారులు ఒత్తిడి చేయడం, దాడి చేయడం సాధ్యమేనా? అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే సామాన్యుడు సైతం ఇప్పుడు న్యాయం కోసం ఏకంగా హైకోర్టు, సుప్రీంకోర్టు గడప తొక్కుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ను విచారణకు పిలిచి ఒత్తిడి చేసి, దాడి చేసి తమకు ఇష్టమొచ్చినట్లుగా స్టేట్ మెంట్ రికార్డు చేసే సాహసం పోలీసు అధికారులు చేస్తారా? అంటే… నిస్సందేహంగా లేదనే సమాధానమే వస్తోంది. మరి ఈ కొత్త, వింత కథ వెనుక ఎవరి హస్తం ఉందన్న విషయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
This post was last modified on June 17, 2025 1:46 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…