ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కీలకమైన మూలపాడు గ్రామానికి మహర్దశ పట్టనుందా? ఈ గ్రామం అమరావతికి ‘ఓపెన్ వే'(ముఖ ద్వారం) కానుందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. అమరావతి కోసం రైతుల నుంచి 34 వేల ఎకరాలకు పైగా ఇప్పటికే సమీకరించారు. దీనిలో అమరావతి ప్రధాన మార్గాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న చర్చ వచ్చినప్పుడు మూలపాడువైపు అధికారులు, ప్రభుత్వం కూడా మొగ్గు చూపుతోంది.
దీంతో రాజధాని ముఖద్వారాన్ని మూలపాడు గ్రామం దగ్గర ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. అంటే.. ఈ ప్రాంతంలోనే రాజధానికి సంబంధించిన కీలకమైన ‘ఐకానిక్ బ్రిడ్జి’ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మూల పాడు గ్రామానికి చేరువలో ఉన్న విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న ఇబ్రహీంపట్నం మండలంలో భూసార పరీక్షలు జరుగుతున్నాయి. ఇది పూర్తయిన వెంటనే ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాలు త్వరలో ప్రారంభమవుతున్నాయి.
మూలపాడు గ్రామంలో రాజధాని ముఖ ద్వారాన్ని ఏర్పాటు చేసేలా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే సీఎం సహా సీఆర్ డీఏ అధికారులకు వివరాలు అందించారు. అంటే.. అమరావతికి వెళ్లాలని అనుకునేవారు.. మూలపాడులో ఏర్పాటు చేసే ముఖ ద్వారం గుండానే ప్రవేశించాల్సి ఉంటుంది. అయితే.. ఇది హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వచ్చే వారికి అందుబాటులో ఉంటుంది.
ఇక, గుంటూరు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి.. ఉండవల్లి నుంచి ఇప్పటికే కరకట్ట దారిని ఏర్పాటు చేశారు. దీనిని ఆరు లేన్ల రహదారిని చేయనున్నారు. ఏదేమైనా మూలపాడుకు మహర్దశ పట్టనుందని అధికారులు కూడా చెబుతున్నారు. ఇది అమరావతికి గేమ్ ఛేంజర్‌గా మారుతుందని అంటున్నారు.
This post was last modified on June 17, 2025 11:58 am
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…