Political News

జీరో నుంచి మొద‌లు.. వైసీపీ ఏం చేయాలి ..!

ప్ర‌జ‌లు ఓడించి ఏడాది అయింది. మ‌రో 4 సంవ‌త్స‌రాల పాటు ఎన్నిక‌ల‌కు అవ‌కాశం లేదు. మ‌రి ఇప్పుడు ఏం చేయాలి? ఇదీ.. వైసీపీలో త‌లెత్తుతున్న ప్ర‌శ్న‌లు. ఎందుకంటే.. ఒక్క ఏడాదిలోనే అనేక అరెస్టులు, అనేక మంది జంపింగుల‌ను పార్టీ చ‌వి చూసింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే నాలుగు సంవ‌త్స‌రాలు అంటే.. మ‌రింత క‌ష్టం. దీంతో పార్టీలో నాయ‌కులు ఏం చేయాల‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. కానీ.. ఇక్క‌డే కీల‌క విషయాన్ని పార్టీ నాయ‌కులు విస్మ‌రిస్తున్నారు.

ప్ర‌స్తుతం వైసీపీ ప‌రిస్థితి ఏమీ బాగోలేదు. అయితే.. ర‌చ్చ లేక‌పోతే.. సైలెంట్ అన్న‌ట్టుగానే నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక, బ‌ల‌మైన ప్ర‌భుత్వ ప‌క్షం కూడా వైసీపీని నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇది రాజ‌కీయంగా చేసే ప‌నే. దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. వైసీపీ దూకుడు విషయంలో మార్పులు చేసుకుని.. జీరో నుంచి మొద‌లు పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మార్పుల దిశ‌గానే కాదు.. అస‌లు ఏమీలేదు.. అనుకుని ప్రారంభించాల‌ని అంటున్నారు.

గ్రామీణ స్థాయి నుంచే కాకుండా.. బూత్ లెవిల్ నుంచి కూడా పార్టీని బ‌లోపేతం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అదేస‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థులు వేస్తున్న ముద్ర‌ల నుంచి కూడా బ‌య‌ట‌కు రావాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తంది. గ‌తంలోనే సైకో అంటూ.. జ‌గ‌న్‌పై పేరు ప‌డింది. ఆనాడే ఆయ‌న దీనిపై స్పందించి ఉంటే.. ప‌రిస్థితి వేరేగా ఉండేది. కానీ, ఇప్పుడు ఇది గ్రామీణ ప్రాంతాల‌కు చేరిపోయింది. ఇక‌, అరాచ‌క పార్టీ ముద్ర కూడా ఇబ్బంది పెడుతోంది. దీంతో విజ్ఞులు సైతం స్పందించ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఇలాంటివాటిని స‌ర్దుబాటు చేసుకోవాలి. మేధావి వ‌ర్గాల‌తో కూర్చుని చ‌ర్చ‌ల‌కు దిగాలి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వైసీపీ ప‌ట్ల పాజిటివిటీని పెంచేలా జ‌గ‌న్ న‌డుం బిగించాలి. ఎక్క‌డో కూర్చుని పార్టీని న‌డిపించే ప‌రిస్థితిని విడ‌నాడాలి. ప్ర‌జ‌ల మ‌ద్యకురావాలి. అలాగ‌ని ర్యాలీలు, రోడ్ షోల‌కు ప‌రిమితం కాకుండా.. స‌భ‌లు, స‌మావేశాల‌కు అవ‌కాశం ఇవ్వాలి.

త‌న హ‌యాంలో ఏం జ‌రిగింది? అనేది ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేయాలి. చూసి చ‌ద‌వ‌డం అనే సంస్కృతిని విడ‌నాడాలి. ఇలా.. జీరో స్థాయి నుంచి ప్రారంభిస్తే త‌ప్ప‌.. పార్టీ పుంజుకునే అవ‌కాశం మాట ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంద‌డం క‌ష్ట‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on June 14, 2025 4:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కుర్రాడి సంగీతం కావాలన్న సూపర్ స్టార్

కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…

35 minutes ago

మరో రాజకీయ చెల్లి! అన్నతో విబేధాలు లేవంటూ..

తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…

1 hour ago

అర్ధరాత్రి మాట కోసం ‘అఖండ 2’ సిద్ధం

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…

3 hours ago

పిఠాపురం కాదు, మంగళగిరి కాదు, ఏపీలో టాప్ నియోజకవర్గం ఇదే!

ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుక‌బ‌డి ఉన్నాయి. మ‌రికొన్ని మ‌ధ్య‌స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…

7 hours ago

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

9 hours ago

ఓడిన వైసీపీకి 10 కోట్లు, గెలిచిన టీడీపీకి…

రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ముఖ సంస్థ‌లు విరాళాలు ఇవ్వ‌డం కొత్త‌కాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వ‌డం(వాటి ఇష్ట‌మే…

10 hours ago