ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తంగా 269 మంది ప్రాణాలు కోల్పోయారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి బాధ్యత వహిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, టీడీపీ యువ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనికంటే కూడా ఆయనపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజిలో ట్రోలింగ్ జరుగుతోంది.
రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ ఏపీలోని విపక్షం వైసీపీ డిమాండ్ చేయడంలో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే… ఉన్నదీ, లేనిదీ అన్న తేడా లేకుండా విషయం ఏది దొరికితే…దానిని తనకు అనుకూలంగా, ఇతరులకు వ్యతిరేకంగా మార్చేసి సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోయడం ఆ పార్టీకి అలవాటే. అందులో భాగంగానే రామ్మోహన్ రాజీనామా చేయాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ను అలా పక్కన పెడితే… గురువారం సాయంత్రం నుంచే రామ్మోహన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభమైపోయింది.
ఎయిర్ ఇండియా ప్రమాద సమయంలో విజయవాడలో ఉన్న రామ్మోహన్ హుటాహుటీన అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని అదికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అక్కడికి వెళ్లిన తొలి మంత్రి రామ్మోహనే. అయితే ఈ పర్యటనకు సంబంధించిన వీడియోకు బీజీఎం జోడిస్తూ… రామ్మోహన్ సిబ్బంది ఓ వీడియో చేసి దానిని సోషల్ మీడియాలో పెట్టారట. ఈ వీడియోను చూసిన నెటిజన్లు… రామ్మోహన్ అక్కడికి పరిశీలనకు వెళ్లారా? లేదంటే రీల్స్ కోసం వెళ్లారా? అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. శుక్రవారం నాటికి ఈ ట్రోలింగ్ మరింతగా పెరిగిపోయింది.
చివరకు ప్రజాశాంతి పార్టీ అదినేత, క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ కూడా రామ్మోహన్ పై విరుచుకుపడ్డారు. రామ్మోహన్ కు ఏవియేషన్ పై అసలు అవగాహనలే లేదని, ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే రాజీనామా చేయాలని పాల్ డిమాండ్ చేశారు. ఎక్కడో జరిగిన పొరపాటుకు విమానం అయితే కూలింది. అయితే ఆ తప్పు నేరుగా కేంద్ర మంత్రే చేశారంటూ నిందించడం తగదు కదా. మరి అలాగని దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి కదా… వాటికి బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసుకుంటూ పోతే ఇక పాలన సాగేదెలా?
This post was last modified on June 13, 2025 9:14 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…