Political News

అన్నీ నిజాలే చెప్పా: హ‌రీష్ రావు

కాళేశ్వరం క‌మిష‌న్ చైర్మ‌న్ జ‌స్టిస్ పీసీ ఘోష్ విచార‌ణ‌కు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయ‌కుడు హ‌రీష్ రావు సోమ‌వారం హాజ‌ర‌య్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయ‌న‌ను క‌మిష‌న్ స‌భ్యులు విచా రించారు. అనంత‌రం మీడియా ముందుకు వ‌చ్చిన హ‌రీష్ రావు.. క‌మిష‌న్ స‌భ్యులు అడిగిన ప్ర‌తి ప్ర‌శ్నకూ తాను.. అన్నీ నిజాలే చెప్పాన‌ని తెలిపారు. ముఖ్యంగా రీ డిజైనింగ్‌పై ఎక్కువ‌గా గుచ్చి గుచ్చి ప్ర‌శ్నించార‌ని తెలిపారు. అయితే.. దీనిపై త‌మ‌కు స్ప‌ష్ట‌త ఉంద‌న్నారు.

అందుకే ఆధారాల‌తో స‌హా ఎందుకు రీడిజైన్ చేయాల్సివ‌చ్చిందో వివ‌రించాన‌ని హ‌రీష్ పేర్కొన్నారు. ప్రాజెక్టు కు సంబంధించిన డీపీఆర్ నుంచి లే అవుట్ వ‌ర‌కు అన్నీ క‌మిష‌న్‌కు సంపూర్ణంగా వివ‌రించాన న్నారు. “దీనిలో దాచుకునేందుకు.. దాచిపెట్టేందుకు కూడా ఏమీ లేదు. అంతా ఉన్న‌ది ఉన్న‌ట్టుగానే వివ‌రించా. మహారాష్ట్ర స‌హా.. సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్‌( సీడబ్ల్యూసీ) చేసిన అభ్యంతరాల కార‌ణంగానే ప్రాజెక్టును రీ డిజైన్ చేయాల్సి వ‌చ్చింది.” అని వివ‌రించారు.

అన్ని విష‌యాల‌ను కేంద్రానికి… కేంద్ర జ‌ల సంఘానికి వివ‌రిస్తూనే ఉన్నామ‌ని.. ప్రాజెక్టు విష‌యంలో ఎలాంటి తేడా లేద‌న్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లప‌ల్లి బ్యారేజీల గురించి త‌న‌ను ప్ర‌శ్నించార‌ని హ‌రీష్ రావు చెప్పారు. అయితే.. వాటికి కేబినెట్ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంద‌ని.. దీనికి సంబంధించిన మినిట్స్ న‌క‌లును కూడా క‌మిష‌న్‌కు ఇచ్చాన‌న్నారు. ఇంజినీర్ల సూచన మేరకే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మార్పు జరిగిందన్నారు.

ఇక‌, కీల‌క‌మైన సొమ్ముల దుర్వినియోగంపైనా.. ప్రాజెక్టు వ్య‌యం పెంపుపైనా త‌న‌ను ప్ర‌శ్నించిన‌ట్టు హ‌రీష్ రావు పేర్కొన్నారు. అయితే.. ప్రాజెక్టును రీ డిజైన్ చేయ‌డం వ‌ల్లే.. ఖ‌ర్చు పెరిగింద‌ని.. దీనిని కూడా అప్ప టి మంత్రి వ‌ర్గంలో చ‌ర్చించిన త‌ర్వాతే నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. దీనికి కార్పొరేష‌న్‌ను ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన‌ట్టు వివ‌రించారు. కేంద్రప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల నుంచే రుణాలు తీసుకున్నట్లు తెలిపారు.

This post was last modified on June 9, 2025 3:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగు ఐపీఎస్ సూసైడ్ ఎఫెక్ట్.. డీజీపీపై బదిలీ వేటు!

హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…

26 minutes ago

మెస్సీ పక్కన సీఎం భార్య.. ఇదేం ఆటిట్యూడ్ బాబోయ్

మెస్సీ ఇండియాకు రావడమే ఒక పండగలా ఉంటే, ముంబైలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

30 minutes ago

వెయ్యి కోట్ల టార్గెట్ అంత ఈజీ కాదు

దురంధర్ అంచనాలకు మించి దూసుకుపోతున్న మాట నిజమే. అఖండ 2 వచ్చాక స్లో అవుతుందనుకుంటే రివర్స్ లో నిన్న వీకెండ్…

50 minutes ago

పద్మభూషణ్ ను కూడా మోసం చేసేశారు…

డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు సామాన్యులకే కాదు, ప్రముఖులకూ పెద్ద ముప్పుగా మారాయి. ప్రభుత్వం ఎంత అవగాహన…

2 hours ago

లెక్క తప్పిన కలర్ ఫోటో దర్శకుడు

ఓటిటిలో డైరెక్ట్ గా రిలీజైనా కలర్ ఫోటోకు మంచి స్పందన వచ్చిన సంగతి ప్రేక్షకులకు గుర్తే. కొత్త ప్రేమకథ కాకపోయినా…

2 hours ago

అఖండ-2.. హిందీలో పరిస్థితేంటి?

అఖండ సినిమా ఓటీటీలో రిలీజైనపుడు హిందీ ప్రేక్షకులు సైతం విరగబడి చూశారు. డివైన్ ఎలిమెంట్స్‌తో తీసిన సినిమాలకు కొన్నేళ్ల నుంచి…

2 hours ago