Political News

సొంత పార్టీ… అయితే ఏంటి.. ఈ నేత‌ల‌కు చెక్ పెట్టాలా ..!

కూట‌మి ప్ర‌భుత్వంలో పార్టీల నాయ‌కుల తీరు .. “అయితే ఏంటి?” అన్న‌ట్టుగానే ఉంది. టీడీపీలోనే కాదు.. జ‌న‌సేన‌, బీజేపీల్లో కూడా.. నాయ‌కుల వ్య‌వ‌హార శైలి.. ఆయా పార్టీల అధినేత‌ల‌కు, అదిష్టానానికి కూడా త‌ల‌నొప్పిగానే మారింది. అంద‌రూ అని కాదు కానీ… కొంద‌రు మాత్రం త‌మ తీరును మార్చుకోలేక పోతున్నార‌న్న చ‌ర్చ పార్టీల‌లో విస్తృతంగా సాగుతోంది. “సొంత పార్టీ.. అయితే ఏంటి?” అనే త‌ర‌హాలో నాయ‌కులు రాజ‌కీయాలు చేస్తున్నారు.

తాజాగా అనంత‌పురం నాయ‌కుల తీరుపై సీఎం చంద్ర‌బాబు విస్మ‌యం వ్య‌క్తం చేయ‌గా.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన నాయ‌కుల వ్య‌వ‌హారం.. ఇప్ప‌టికీ జ‌న‌సేన‌లో కాక రేపుతూనే ఉంది. ఒక‌రిద్ద‌రు నాయ‌కులు పార్టీ కార్య‌క్ర‌మాల్లో ఉన్నా.. కొంద‌రిని మాత్ర‌మే క‌లుస్తున్నారు. కొంద‌రితోనే ట‌చ్‌లో ఉంటున్నారు. మిగిలిన వారిపై ఇత‌ర ముద్ర‌లు వేస్తున్నారు. ఇక‌, బీజేపీలో అయితే.. గ‌త ఏడాది నుంచి ఉన్న విధానాలు ఇప్ప‌టికీ మార‌లేదు.

పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డంలో సీఎం చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంతో కృషి చేశార‌ని ఒప్పుకొంటున్నా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం నాయ‌కులు రాజీ ప‌డ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. విజ‌య‌వాడ‌లో అయితే.. ఎవ‌రికి వారు అన్న‌ట్టుగా కూట‌మి పార్టీల నాయ‌కులు కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. తాజాగా మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని అంద‌రూ లైట్ తీసుకున్నారు. ఇక‌, ‘యోగాంధ్ర’ కార్య‌క్ర‌మాన్ని సీఎం చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఎంతో సీరియ‌స్‌గా తీసుకున్నారు.

ప్ర‌ధాని మోడీ ముందు ప‌రువు కాపాడాల‌ని కూడా.. వారు పార్టీ నాయ‌కుల‌కు అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో చెప్పుకొ చ్చారు. కానీ, ఏం లాభం. ఎవ‌రూ కూడా ఈ కార్య‌క్ర‌మానికి అంత‌గా స‌హ‌క‌రించ‌డం లేదు. దీంతో స్వ‌చ్ఛంద సంస్థ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాలే హైలెట్ అవుతున్నాయి. ఈ విష‌యంలో పార్టీ నాయ‌కుల మ‌ధ్య క‌లివిడి లేక‌పోవ‌డంతో మూడు పార్టీల్లోనూ ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌గా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా జ‌రిగినా.. ఈ యోగాంధ్ర‌ను స‌క్సెస్ చేయాల‌ని అధినేత‌లు చెబుతున్నారు. అయినా.. ‘అయితే ఏంటి?’ అనే టైపులో నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 8, 2025 4:36 pm

Share

Recent Posts

నిన్న సందీప్ వంగ… నేడు శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…

4 hours ago

అమితాబ్ టెక్నిక్ ఫాలో అయితే… మీ స‌తీమ‌ణి టైమ్‌కి రెడీ!

ఏదైనా పెళ్లో.. మ‌రో ఫంక్ష‌నో.. భార్యా భ‌ర్త‌లు ఇరువురు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. స‌హ‌జంగా దంప‌తుల్లో ఉత్సాహం ఉంటుంది. భ‌ర్త ముందుగానే…

11 hours ago

లెక్క తప్పుతున్న యూత్ సినిమాలు

యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…

12 hours ago

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

13 hours ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

18 hours ago