కూటమి ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేల చొరవ అద్భుతః అని అనిపిస్తోంది. ఇది ఎవరో వారంటే ఇష్టమైనవారు.. వారికి అనుచరులుగా ఉన్న వారు చెబుతున్న మాట కాదు. అచ్చంగా జనాల నుంచే ఈ మాట వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు వస్తుంటే.. హారతులు పట్టే పరిస్థితి మరోసారి ఏపీలో కనిపిస్తోంది. ఇది ఒకప్పటి సంప్రదాయం. ఎమ్మెల్యేలు తమకు మేలు చేశారని భావిస్తే.. ప్రజలు వారిని ఎలా నెత్తిన పెట్టుకుంటారన్నది గతంలో ఎప్పుడో జరిగింది.
ఇప్పుడు మరోసారి అలాంటి వాతావరణం కనిపిస్తోంది. అది కూడా.. కొన్ని కీలక నియోజకవర్గాల్లో మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో కొన్ని నియోజకవర్గాల పేరు చెబితే వెగటు పుట్టించిన చోట ఇప్పుడు కూటమి పార్టీల నాయకులు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు వారికి నిజంగానే హారతులు పడుతున్నా రు. ఈ జాబితాలో విజయవాడలోని తూర్పు, గుంటూరులోని బాపట్ల, వినుకొండ, కృష్ణాలోని గుడివాడ, విశాఖలో తూర్పు నియోజకవర్గం, అదేవిధంగా అనంతపురం అర్బన్ వంటివి కనిపిస్తున్నాయి.
ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు.. సైలెంట్‌గా ఉంటున్నారు. కానీ.. ప్రజలకు మాత్రం పనులు చేసుకుని పోతున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పటికప్పుడు చేరువగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా గుడివాడలో అయితే.. అసలు పిలిస్తే పలుకుతున్నారు.. అనే పేరు రావడం ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు పెట్టని కోటగా మారింది. ఎక్కడా తేడా లేకుండా.. రాకుండా ఆయన ప్రజలకు చేరువగా ఉంటున్నారు. గతంలో మూడు దశాబ్దాలుగా పరిష్కారం కాని వాటిని కూడా ఇప్పుడు పరిష్కరిస్తున్నారు.
ఇక, బాపట్లలో అయితే.. పక్కనే కృష్ణమ్మ ఉన్నా.. ఇక్కడ చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. దీనిని పరిష్కరించేందుకు వేగేశ్న నరేంద్ర వర్మ ప్రయత్నం చేస్తున్నారు. జలజీవన్ మిషన్‌ను ఇక్కడకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారు. విజయవాడ తూర్పులో కొండ ప్రాంతాల వారికి అసంపూర్తిగా ఉన్న పట్టాలు ఇచ్చేశారు. అలాగే.. అనంతపురం అర్బన్‌లో రహదారి వెడల్పు నుంచి ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఇక్కడి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేస్తున్నారు. సో.. ఇలా.. కొందరు ఎమ్మెల్యేల తీరు అద్భుతః అన్నట్టుగా ఉందని నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
This post was last modified on June 8, 2025 12:15 pm
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…