ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్తగా సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్స హించేందుకు నడుం బిగించింది. కొత్తగా `షైనింగ్ స్టార్` అవార్డులను ప్రకటించింది. వీటిని 10, ఇంటర్ చదవి విద్యార్థులకు ఇవ్వాలని తాజాగా నిర్ణయించింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రజలకు మరింత చేరువ చేయడంతోపాటు.. విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
గత విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థులు సాధించిన మార్కులను బట్టి ఈ అవార్డులను ఇవ్వనున్నారు. అంటే.. 2024-25 విద్యాసంవత్సరం నుంచే `షైనింగ్ స్టార్` అవార్డులను ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ అవార్డులు ఇస్తారు. అవార్డు కింద.. మెమొంటో సహా 20 వేల రూపాయల నగదును కూడా విద్యార్థులకు అందిస్తారు. తద్వారా వారి ఉన్నత చదువులకు ప్రభుత్వం ప్రోత్సహించనుంది.
ఎలా ఎంపిక చేస్తారు?
+ పదో తరగతిలో 500 పైన మార్కులు సాధించిన వారికి ఈ అవార్డులు ఇస్తారు.
+ అన్ని సామాజిక వర్గాల్లోని విద్యార్థులను ఈ అవార్డులకు అర్హులుగా పేర్కొన్నారు.
+ మండలాల వారీగా ప్రతిభ గల విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
+ ఒక్కొక్క మండలం నుంచి ఆరుగురు పదో తరగతి విద్యార్థులను ఎంపిక చేస్తారు.
+ ఎంపిక చేసిన విద్యార్థుల్లో ఇద్దరు ఓసీ, ఇద్దరు బీసీ, 1 ఎస్సీ, 1 ఎస్టీ విద్యార్థులు ఉండేలా చూస్తారు.
+ అయితే, ఇంటర్ విద్యార్థులను మాత్రం.. ప్రతి జిల్లాకు 36 మంది చొప్పున ఎంపిక చేస్తారు.
This post was last modified on June 6, 2025 8:05 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…