వైసీపీ అధినేత జగన్ అంటేనే కారాలు మిరియాలు నూరే అనంతపురం జిల్లాకు చెందిన, టీడీపీ నాయకుడు, ప్రస్తుతం తాడిపత్రి మునిసిపల్ చైర్మన్‌గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా వైసీపీ అధినేత జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్టాడుతూ.. “జగన్ మారాలి. లేకపోతే.. కష్టమే. ఇంకా బెదిరింపులు.. సాధింపులు చేస్తానంటే.. ప్రజలు ఒప్పుకోరు. ప్రజలు కూడా రక్షణ కోరుకుంటున్నారు. బెదిరింపులతో రాజకీయాలు చేయలేరు. ఆ రోజులు పోయాయి. వాళ్ల నాయన కూడా మారాడు. అందుకే ప్రజలు యాక్సప్ట్ చేశారు” అని జేసీ వ్యాఖ్యానించారు.
పోలీసులను, అధికారులను బెదిరించడం వల్ల జగన్ కు ఎలాంటి ప్రయోజనం లేదని జేసీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అభివృద్దిని కోరుకుంటున్న ప్రజలు.. జగన్‌ను ఎందుకు పక్కన పెట్టారో తెలుసుకోవడం ఈజీనేని చెప్పారు. అందరికీ ఈ విషయంపై క్లారిటీ ఉందని.. కానీ జగన్‌కే క్లారిటీ లేదని అన్నారు. ఇప్పటికైనా మార్పు దిశగా జగన్ అడుగులు వేయకపోతే.. ఆయనతో పాటు పార్టీలో ఉన్నవారు కూడా.. భూస్థాపితం అయిపోతారని అన్నారు. “మేమేం చేస్తాం. ప్రజలే చేస్తారు. అందరూ చూస్తున్నారు. ఏడాది అయింది. సింపతీలేదు. పైగా బెదిరింపులు. ఎవరు మాత్రం ఇష్టపడతారు?” అని జేసీ వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ప్రజల్లోకి రావడానికి జగన్‌కు ఇంకా సమయం ఉందని వ్యాఖ్యానించారు. అయితే.. ఒక టీడీపీ నాయకుడిగా తాను జగన్ గురించి మాట్లాడడం లేదన్న జేసీ.. వైఎస్ కుటుంబానికి ముఖ్యంగా విజయమ్మ మొహం చూసి జగన్‌కు సలహా ఇస్తున్నానని చెప్పారు. “పార్టీలో అందరూ మంచోళ్లే. కానీ, …..డే మొండి ఘటం. ఎవరి మాట వినడు. చెబితే అర్ధం చేసుకోడు. ఏం చేస్తారు పాపం.” అని జేసీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి కూటమి మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. పథకాలు, సంక్షేమం ఇవన్నీ కాదని.. అభివృద్ధి, ఉద్యోగాలు కోరుకుంటున్నారని చెప్పారు. “ఒక ఇంట్లో 20 వేలు సంపాయించుకునే ఉద్యోగం కావాలా.. ఏడాదికి 10 వేలు ఇచ్చే సంక్షేమం కావాలా?” అని జేసీ ప్రశ్నించారు.
This post was last modified on June 1, 2025 6:21 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…