Political News

ఈ ఆస్తులు, పెట్టుబ‌డులు ఎక్క‌డివి.. సిట్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ కుంభ‌కోణంలో 3200 కోట్ల రూపాయ‌ల‌కుపైగానే సొమ్ములు చేతులు, దేశాలు కూడా మారాయ‌ని భావిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం.. ఈ కేసులో నిందితులుగా ఉన్న న‌లుగురిని ఒకే విడ‌త‌లో శుక్ర‌వారం విచారించింది. శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన విచార‌ణ‌లో ప‌లు కీల‌క ప్ర‌శ్న‌లు సంధించింది. ప‌క్కా ఆధారాల‌ను ఇప్ప‌టికే సేక‌రించిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు వాటిని నిందితుల ఎదురుగా పెట్టి.. ప్ర‌శ్న‌లు సంధించింది. ముఖ్యంగా 2019-24 మ‌ధ్య ఈ నిందితుల‌కు వ‌చ్చిన ఆస్తులు, బంగ‌ళాలు, కార్ల‌పై ఆరా తీసింది.

తాజాగా శుక్ర‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో మ‌ద్యం కుంభ‌కోణంలో కీల‌క ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రాజ్ క‌సిరెడ్డి, అప్ప‌ట్లో సీఎం జ‌గ‌న్‌కు ఓఎస్‌డీగా ప‌నిచేసి కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, మాజీఐఏఎస్ అధికారి ధ‌నుంజ‌య్‌రెడ్డి, అకౌంటెంట్ గోవింద‌ప్ప బాలాజీల‌ను ఒకే చోట హాజ‌రు ప‌రిచి.. ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందానికి నేతృత్వం వ‌హిస్తున్న విజ‌య‌వాడ పోలీసు క‌మిష‌న‌ర్ రాజ‌శేఖ‌ర్‌బాబు వీరిని ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలో కీల‌క ఆధారాల‌ను, బ్యాంకు స్టేట్‌మెంట్ల‌ను, రెవెన్యూ శాఖ నుంచి తీసుకున్న వివ‌రాల‌ను.. ఇప్ప‌టికే విచారించిన నిందుతులు ఇచ్చిన స్టేట్‌మెంట్ల‌ను కూడా వారి ముందు పెట్టి అనేక ప్ర‌శ్న‌లు సంధించారు.

వీటిలో ప్ర‌ధానంగా 2019-24 మ‌ధ్య ఖ‌రీదైన కార్లు ఎక్క‌డ నుంచి కొన్నారు? ఎలా కొన్నారు? వీటికి సొమ్ములు ఎవ‌రిచ్చారు? అనే విష‌యాల‌పై కూపీ లాగారు. అంతేకాదు.. సినిమాల్లో పెట్టుబడులు పెట్టిన రాజ్ క‌సిరెడ్డికి.. ఆ సొమ్ము ఎక్క‌డ నుంచి వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు. అదేవిధంగా బెంగ‌ళూరులో రియ‌ల్ ఎస్టేట్లో పెట్టుబ‌డులు పెట్టిన బాలాజీ గోవింద‌ప్ప‌ను కూడా ఇదే త‌ర‌హాలో ప్ర‌శ్నించారు. ఆ సొమ్ములు ఎక్క‌డ నుంచి వ‌చ్చాయి? భార‌తీ సిమెంట్స్ మీకు ఇస్తున్న వేత‌నం.. ఎంత‌? ఇత‌రత్రా ఆదాయాలు ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు. అయితే.. ఆయా ప్ర‌శ్న‌ల‌కు వారు తెలియ‌దు.. గుర్తులేదు.. అనే రొటీన్ స‌మాధానాలే ఇచ్చిన‌ట్టు తెలిసింది. ఇక‌, ఈ విచార‌ణ ఇప్ప‌టితో ముగియ‌ద‌ని.. మ‌రింత లోతుగా విచారించాల్సి ఉంటుంద‌ని సిట్ అధికారులు తెలిపారు.

This post was last modified on May 31, 2025 9:43 am

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

2 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

3 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

4 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

5 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

5 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

6 hours ago