సొంత పార్టీ నేతలే తనను ఓడించాలని చూశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో దుమారం రేపాయి. ఇక, బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేయాలని చూస్తున్నారని, ఆ ప్రతిపాదనను తాను వ్యతిరేకించానని కవిత చేసిన వ్యాఖ్యలు బీజేపీతో పాటు బీఆర్ఎస్ ను ఇరకాటంలో పడేశాయి. ఈ క్రమంలోనే కవిత వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
ఆఫ్ ద రికార్డ్ లో కవిత చేసిన వ్యాఖ్యలు నిజమేనని రాజాసింగ్ అంగీకరించారు. భారీ ప్యాకేజీ ఇస్తే బీఆర్ఎస్ నేతలతో బీజేపీ నేతలు కలిసిపోతారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాలు బీఆర్ఎస్ నేతలు డిసైడ్ చేస్తారని, గతంలో ఇలా చాలాసార్లు జరిగిందని రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలా చేయబట్టే బీజేపీ నష్టపోయిందని, ప్రతి ఎన్నికలలో బీజేపీ నేతలు ఏదో ఒక పార్టీతో కుమ్మక్కవుతున్నారని, అందుకే పార్టీ నష్టపోయిందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రావడం లేదు అనే కోణంలో బీజేపీ నేతలుంతా ఆలోచించాలని అన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో బీజేపీ ఏనాడో అధికారంలోకి రావాల్సి ఉందని చెప్పారు. అయితే, ఇతర పార్టీ నేతలతో బీజేపీ నేతలు కుమ్మక్కు కావడంతోనే అది జరగలేదని, ఆ సంగతి అందరికీ తెలుసు అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు, కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. అక్రమాస్తుల పంపకాల విషయంలో వచ్చిన కుటుంబ కలహాలను తన తండ్రి, సోదరుడు, బావతో చర్చించి పరిష్కరించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సరికాదని చెప్పుకొచ్చారు.
This post was last modified on May 29, 2025 4:08 pm
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…