ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అంటేనే సాధారణంగా పని రాక్షసుడు అనే పేరుంది. రోజుకు 18 గంటల పాటు ఆయన పనిచేస్తుంటారని అంటారు. కనిపించే ఫలితాన్ని బట్టి చూసినా అది నిజమేనని తేలుతుంది. ఇక, తాజాగా కడపలో మహానాడు జరుగుతోంది. దీనిని సక్సెస్ చేసేందుకు ఎంతో మంది నాయకులు ఉన్నా 19కి పైగా కమిటీలు ఉన్నా.. చంద్రబాబే అన్నింటినీ జాగ్రత్తగా చూసుకున్నారన్నది తెలిసిందే.
సో.. ఈ వయసు(75)లో ఆయన ఇంత బిజీగా ఉండడం అన్నీ తానే అయి నిర్వహించడం ఒక స్టోరీ అయితే.. మహానాడు ముగియకుండానే వచ్చే మూడు రోజుల పాటు ఆయన ఎంత బిజీగా ఉన్నారో.. తెలిస్తే.. అందరూ నివ్వెర పోతారు. అంత బిజీ అయిపోయారు చంద్రబాబు. గురువారం సాయంత్రం మహానాడు లో భారీ బహిరంగ సభ ఉంది. దీనికి ఐదు లక్షల మంది కార్యకర్తలు, ప్రజలు హాజరు అవుతారని అంచనా వేశారు. మొబిలైజేషన్ కూడా అలానే ఉంది.
అయితే.. ఈ సమావేశాన్ని చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. సుదీర్ఘ ప్రసంగం కూడా చేయనున్నారు. గత మూడు రోజుల నుంచి కూడా మహానాడులో తీరిక లేకుండా ఉన్న ఆయన.. ఇప్పుడు మూడో రోజు సాయంత్రం సభ ముగిసీ ముగియగానే.. ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కేయనున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు(శుక్రవారం) ఢిల్లీలో జరగనున్న సీఐఐ ఏజీఏం సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులు, రాయితీలపై చర్చించనున్నారు.
ఇక, శనివారం ఉదయం నేరుగా.. ఆయన ఢిల్లీ నుంచి రాజమండ్రికి వస్తారు. కోనసీమ జిల్లా ముమ్మిడి వరం మండలం సీహెచ్ గునేపల్లికి చేరుకుని సామాజిక భద్రతా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొం టారు. అనంతరం.. అక్కడే సభ నిర్వహించనున్నారు. లబ్ధిదారులతో ముఖాముఖి చర్చించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం.. పార్టీ నాయకులతో భేటీ కానున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. గత రెండు రోజులుగా మహానాడుతో బిజీగా ఉన్న చంద్రబాబు.. ఇది అయ్యీ అవ్వకముందే.. వచ్చే మూడు రోజుల పాటు తీరిక లేకుండా గడుపుతుండడం గమనార్హం.
This post was last modified on May 29, 2025 3:55 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…