Political News

వైసీపీ నేత‌ల మ‌రిన్ని అరెస్టులు.. ఏపీ పోలీసుల సంకేతాలు!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి అరెస్టుతో ఆ పార్టీలో తీవ్ర అల‌జ‌డి నెల‌కొంది. ఇప్ప‌టికే చాలా మంది నాయ‌కులు అరెస్టు కావ‌డం.. మ‌రోవైపు కేసులు త‌రుముతున్న వారి సంఖ్య పెరుగుతున్న క్ర‌మంలో పార్టీలో తీవ్ర ఆవేద‌న‌.. ఆందోళ‌న నెల‌కొంది. జ‌గ‌న్ త‌క్ష‌ణ‌మే బ‌య‌ట‌కు రావాల‌న్న నినాదాలు కూడా ఊపందుకుంటున్నాయి. మ‌రీ ముఖ్యంగా కాకాని అరెస్టు త‌ర్వాత‌.. జ‌గ‌న్‌పై ఒత్తిడి మ‌రింత పెరిగింది.

ఇదిలావుంటే..ఈ అరెస్టుల ప‌ర్వం కొన‌సాగుతుందా? ఇక‌నైనా ఆగుతుందా? అనే విష‌యంపై విజ‌య‌వాడ పోలీసులు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “ఇంకా అయిపోలేదు” అంటూ.. ముఖ్య అధికారి ఒక‌రు మీడియా ముందు వ్యాఖ్యానించారు. కాకాణి అరెస్టుపై వివ‌రాలు కోరుతూ.. విజ‌య‌వాడ సీనియ‌ర్ అధికారిని మీడియ ప్ర‌శ్నించిన‌ప్పుడు.. ఆయ‌న చెప్పిన స‌మాధానం ఇదే. దీనిని బ‌ట్టి వైసీపీ నేత‌ల అరెస్టులు మ‌రిన్ని కొన‌సాగుతాయ‌న్న సంకేతాలు వ‌చ్చాయి.

అయితే.. వీరిలో ఎవ‌రెవ‌రు ఉన్నార‌న్న విష‌యం ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాలను గ‌మ‌నిస్తే.. మాజీ మంత్రి సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పేరుప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఆయ‌న‌పై చిత్తూరు జిల్లా టీడీపీ నాయ‌కులు అనేక ఫిర్యాదులు చేశారు. గనులు, అట‌వీ భూముల ఆక్ర‌మ‌ణ‌లు, మ‌ద‌నప‌ల్లి ఆర్డీవో కార్యాల‌యంలో ప‌త్రాల ద‌హ‌నం.. స‌హా ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ్ముళ్ల బెదిరింపులు.. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చిత్తూరు జిల్లాలోని అంగ‌ళ్ల‌లో జ‌రిగిన వివాదం.. రాళ్ల దాడి.. ఇలా అనేక కేసులు పేరుకు పోయాయి.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసులోనూ పెద్దిరెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోలేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అదేవిధంగా తూర్పుకు చెందిన మ‌రో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. తాజాగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాను అడ్డుకునే క్ర‌మంలో ధియేట‌ర్ల బంద్‌కు పిలుపునిచ్చిన న‌లుగురిలో ఆయ‌న పేరు ఉంద‌ని న‌ట్టి కుమార్ వ్యాఖ్యానించారు. గ‌తంలో బియ్యం ఎగుమ‌తుల కేసు కూడా ఉంది. ఇలా.. చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on May 26, 2025 12:48 pm

Share
Show comments

Recent Posts

లైలా గాయానికి ఫంకీ మందు పని చేస్తుందా

విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…

2 hours ago

ఒకవేళ కవిత సీఎం అయితే?

#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజ‌న్ల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌.. ఇదే స‌మ‌యంలో ప‌లువురు నెటిజ‌న్లు…

2 hours ago

సూపర్ న్యూస్… సుబ్బులక్ష్మిగా సాయిపల్లవి ?

భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…

3 hours ago

పదిరోజుల్లోనే మాట నిలబెట్టుకున్న పవన్

మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…

5 hours ago

మంచు మనోజ్ సినిమాకు మల్టీస్టారర్ హంగులు ?

నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…

5 hours ago

తెలుగు ఐపీఎస్ సూసైడ్ ఎఫెక్ట్.. డీజీపీపై బదిలీ వేటు!

హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…

6 hours ago