Political News

హాట్ టాపిక్…  కేసీఆర్ కు కవిత 6 పేజీల లేఖ

తెలుగు నేల రాజకీయాల్లో గురువారం ఓ హాట్ టాపిక్ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాదించిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆయన కుమార్తె, మాజీ ఎంపీ కవిత ఓ సుదీర్ఘ లేఖ సంధించారు. దాదాపుగా 6 పేజీలతో కూడిన ఈ లేఖ ఇటీవలే వరంగల్ కేంద్రంగా జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తర్వాతే రాసినట్లుగా భావిస్తున్నారు. అయితే ఇతమిద్ధంగా ఎప్పుడు ఆమె తన తండ్రికి ఈ లేఖ రాశారన్న విషయం మాత్రం తెలియ రాలేదు. 

మై డియర్ డాడీ… అంటూ మొదలుపెట్టిన కవిత… వరంగల్ సభా వేదిక మీద పార్టీ సరైన చర్యలే తీసుకోలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ మోస్ట్ నేతలకు కూడా కనీసం వేదిక మీద చోటు ఇవ్వలేకపోయారని కూడా ఆమె ఆక్షేపించారు. కనీసం కొందరు సీనియర్ మోస్ట్ నేతలతో అయినా మాట్లాడించాల్సి ఉండిందని కూడా ఆమె అభిప్రాయపడ్దారు. ఈ సభలో సీనియర్ల మాటల్లేకుండా నేరుగా కేసీఆర్ ప్రసంగంతోనే సభను ముగించిన తీరును ఆమె తప్పుబట్టారు.

వరంగల్ లో నిర్వహించిన సభ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ కదా. అదే అంశాన్ని గుర్తు చేసిన కవిత… సిల్వర్ జూబ్లీ సభా వేదిక మీద నుంచి కేసీఆర్ నుంచి మరింత మంచి ప్రసంగాన్ని జనం ఆశించారని అన్నారు. అయితే ప్రజల ఆశలను అడియాశలు చేస్తూ కేసీఆర్ ప్రసంగం చప్పగా సాగిందని ఆమె పేర్కొన్నారు. చాలా కీలక అంశాలను సభా వేదికపై నుంచి ప్రస్తావించాల్సి ఉన్నప్పటికీ ప్రస్తావించలేకపోయారని… ఫలితంగా సభ ముఖ్య ఉద్దేశ్యం ఫలించలేదని ఆమె అన్నారు.

ఇక చివరగా అయినా కూడా చాలా కీలకమైన అంశాన్ని కవిత ప్రస్తావించారు. వరంగల్ సభా వేదిక మీద నుంచి ప్రసంగించిన కేసీఆర్…కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీ మీద కేవలం రెండంటే రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారని, ఇది బీఆర్ఎస్ పై లెక్కలేనన్ని అనుమానాలను క్రియేట్ చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మీద మీకు ఎందుకంత సాఫ్ట్ కార్నార్?.. నన్ను బీజేపీ చాలా ఇబ్బంది పెట్టింది డాడీ అంటూ కవిత ఆ లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంత చేసినా కూడా ఆ పార్టీని పెద్దగా టార్గెట్ చేయకుండానే కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారని కవిత ఆరోపించారు. ఇప్పుడు ఈ లేఖ తెలుగు నేల రాజకీయాల్లో తెగ వైరల్ అవుతోంది.

This post was last modified on May 22, 2025 10:26 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

5 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

5 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

5 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

5 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

7 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

9 hours ago