Movie News

ప్రభాస్ మిస్సయినా బన్నీ మూవీ దొరికింది

స్పిరిట్ నుంచి దీపికా పదుకునేని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తప్పించారనే వార్త దావానలంలా పాకిపోవడం చూస్తూనే ఉన్నాం. తన డిమాండ్లను తట్టుకోలేక సందీప్ ఆమెను వద్దనుకుని కాంట్రాక్టు క్యాన్సిల్ చేశారనే టాక్ ముంబై మీడియాని ఊపేసింది. ఎనిమిది నెలల చిన్నారికి తల్లయినందు వల్లే ప్రత్యేక వెసులుబాటు అడిగిందని, కావాలనే తన గురించి చెడు ప్రచారం చేస్తున్నారనే తరహాలో కొందరు డిఫెన్స్ చేస్తున్నారు కానీ అంత ఇబ్బంది ఉన్నప్పుడు భారీ చిత్రాలు ఒప్పుకోవడం ఎందుకనే లాజిక్ కి మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. బిడ్డను చూసుకోవడం కన్నా సినిమాలు ముఖ్యం కాదుగా

దీని సంగతలా ఉంచితే ప్రభాస్ మూవీ మిస్సయినా అల్లు అర్జున్ సినిమాలో దీపికా పదుకునేని తీసుకున్నారనే వార్త అభిమానులకు కొత్త కిక్ ఇస్తోంది. అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీలో మెయిన్ హీరోయిన్ గా తను దాదాపు కన్ఫర్మ్ అయినట్టేనట. అయిదుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ దీపికకు కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. ఏడు వందల కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్న ఈ విజువల్ గ్రాండియర్ పనుల కోసమే అట్లీ ఇటీవలే హైదరాబాద్ వచ్చాడు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేలా షెడ్యూల్స్ వేస్తున్నారని తెలిసింది.

కల్కి 2898 ఏడితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకునేకు కల్కి 2లో కూడా భాగం ఉంటుంది. దానికన్నా ముందు అల్లు అర్జున్ 22 రిలీజవుతుంది కాబట్టి రేంజ్ మాములుగా పెరగదు. ఇప్పటిదాకా బన్నీ మూవీకి సంబంధించి కాన్సెప్ట్ వీడియో తప్ప ఇంకెలాంటి ప్రమోషన్ కంటెంట్, క్యాస్టింగ్ అనౌన్స్ మెంట్లు రాలేదు. ఒక్కొక్కటిగా ప్రణాళిక ప్రకారం అప్డేట్ ఇవ్వడానికి అట్లీ రెడీ అవుతున్నాడట. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మల్టీ లాంగ్వేజ్ మూవీలో విఎఫ్ఎక్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉండబోతోంది. అందుకే షూటింగ్ అయిపోయినా పోస్ట్ ప్రొడక్షన్ కు చాలా ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు. . 

This post was last modified on May 22, 2025 9:17 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

6 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

6 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

6 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

6 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

8 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

10 hours ago